కాంచన-3 కోసం రాఘవ లారెన్స్ భారీ సెటప్... 1400 డాన్సర్లు, రూ. 1.3 కోట్ల ఖర్చు!

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2‌తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్‌తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ త్వరలో కాంచన-3తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇప్పటి వరకు వచ్చిన కాంచన సీరీస్ చిత్రాలన్నింటికీ భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు లారెన్స్. ఇందులో భాగంగా దాదాపు 1400 మంది డాన్సర్స్ తో రూ. కోటి ముప్పై లక్షలు ఖర్చుపెట్టి ఓ పాటను చిత్రీకరించడం విశేషం.

రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో రాఘ‌వ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ మూవీని బి.మధు విడుదల చేస్తున్నారు. రిలీజ్ సందర్భంగా ఆయన సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

1400 మంది డాన్సర్లతో చిత్రీకరణ

1400 మంది డాన్సర్లతో చిత్రీకరణ

‘‘కాంచన-3 చిత్రం ఏప్రిల్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన నట విశ్వరూపం చూపించాడు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కించాం. దాదాపు 1400 మంది డాన్సర్స్‌తో మాస్టర్ అత్యద్భుతంగా సాంగ్‌ షూట్ చేశారు'' అని మధు వెల్లడించారు.

6 రోజుల పాటు చిత్రీకరణ

6 రోజుల పాటు చిత్రీకరణ

400 మంది అఘోరా గెటప్స్ తో... 1000 మంది డిఫ్రెంట్ లుక్‌తో 6 రోజుల పాటు సాంగ్ చిత్రీకరణ చేశారు. లారెన్స్‌కి కాంచన 3 చిత్రం తన కెరీర్‌కే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు . కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయని వెల్లడించారు.

బలమైన కథ, కథనం

బలమైన కథ, కథనం

ఇప్పటి వరుక వచ్చిన ముని సీరిస్ చిత్రాలకంటే బలమైన కథ, కథనంతో ‘కాంచన-3' వస్తోంది. మంచి సర్ ప్రైజ్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేయనున్నారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద చూడని గొప్ప నటన మీరు ఈ నెల 19 న తెలుగు, తమిళ భాషల్లోచూస్తారు.. మా బ్యానర్‌లో ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు.

కాంచన-3

కాంచన-3

రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, స‌త్య‌రాజ్‌, కిషోర్ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి- వెట్రి, స‌ర్వెష్ మురారి, క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌కత్వం: రాఘ‌వ లారెన్స్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X