ఒళ్లుగగుర్బొడి సీన్లతో భయపెడుతున్న ‘కాంచన-3’ (ట్రైలర్)
ముని, కాంచన, కాంచన 2 లాంటి హర్రర్ కామెడి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ త్వరలో కాంచన-3తో రాబోతున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
సినిమా ప్రమోషన్లో భాగంగా గురువారం 'కాంచన 3' ట్రైలర్ విడుదలైంది. ఒళ్లు గగుర్బొడిచే సీన్లతో ట్రైలర్ ప్రేక్షకులను భయకంపితులను చేసేలా ఉంది. ట్రైలరే ఇలా ఉందంటే సినిమా ఇంకెలా ఉంటుందో అనే అంచనాలు ప్రేక్షకుల్లో పెరిగిపోయాయి.

కాంచన 2 ట్రైలర్
‘నిప్పును కూడా తాకొచ్చు.. నలుపును తాకొద్దు'... ‘నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్' అంటూ లారెన్స్ చెప్పే డైలాగులు ట్రైలర్లో హైలెట్ అయ్యాయి. లారెన్స్ ఇందులో తెల్ల జుట్టు, తెల్లగడ్డం, తెలుపు దుస్తువులతో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు.

హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్
హాలీవుడ్ హారర్ సినిమా తరహాలో ఉన్న గ్రాఫిక్స్ థియేటర్లో ప్రేక్షకులకు సరికొత్త హారర్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తాయనే నమ్మకం మరింత పెంచింది. కాంచన సిరీస్‌లో ఇప్పటి వరకు వచ్చి అన్ని చిత్రాలను మించిపోయేలా ఉంటుందని స్పష్టమవుతోంది.

తెలుగులో బి.మధు
తెలుగు వెర్షన్‌ను లైట్ హౌస్ మూవీమేకర్స్ ఎల్ఎల్‍పి బ్యానర్ పై బి.మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్స్ అధినేత రాఘవ నిర్మించారు. రాఘవ లారెన్స్ తీసిన హర్రర్ కామెడీ సినిమాన్నీ సూపర్ హిట్లే. 'కాంచన-3' మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వేసవిలో ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతుందని నిర్మాతలు తెలిపారు.
కాంచన 3
రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కొవైసరళ, కభీర్ దుహన్ సింగ్, శ్రీమన్, దేవదర్శిని, సత్యరాజ్, కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి- వెట్రి, సర్వెష్ మురారి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











