అమ్మాయిలు ఉంటే చాలు .. పుష్ప 2పై బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర తెలుగు సినిమాల రూలింగ్ ఏ లెవెల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకొక్కటిగా వచ్చిన పలు పాన్ ఇండియా చిత్రాలు.. హిందీ సినిమాలు గ్లోబల్ వైడ్ గా సెట్ చెయ్యని వసూళ్లు కూడా అందుకొని దుమ్ము లేపుతున్నాయి. ఇదిలాఉండగా మన తెలుగు సినిమాల డామినేషన్‌తో హిందీ పరిశ్రమ విలవిలలాడుతోంది.

ఇక్కడి నుంచి తెలుగు సినిమాల మార్కెట్‌ని అర్ధం చేసుకున్న నిర్మాతలు మన సినిమాలు కొనుక్కోవడం, మన దర్శకులతో సినిమాలు చేస్తుండటం కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటికీ వారిలో కొంచెం ఇన్ సెక్యూరిటీ ఉంది. కానీ లేటెస్ట్‌గా హిందీ సినిమా నుంచే ఓ కాంట్రవర్సియల్ బ్యూటీ, అలాగే రాజకీయ నాయకురాలు అయిన కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ సినిమాపై అలాగే తమ హీరోలపై చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

kangana makes shocking comments on bollywood with pushap 2

కాగా కంగనా నుంచి ఇలాంటి మాటలు కొత్త కాదు . కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ కల్చర్ పై ఆమె పలు షాకింగ్ కామెంట్స్ చేస్తూ వచ్చింది. ఇపుడు కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ భారీ చిత్రం పుష్ప 2 సెట్ చేసిన సెన్సేషన్‌తో బాలీవుడ్ హీరోలు అలాగే బాలీవుడ్ పరిశ్రమపై పలు కీలక కామెంట్స్ మాట్లాడినట్టు తెలుస్తుంది.

దీంతో మా బాలీవుడ్ వాళ్ళు పుష్ప 2 లాంటి సినిమాలు తియ్యలేరు అని వీళ్ళకి కేవలం బేబ్స్(అమ్మాయిలు/హీరోయిన్స్) ఇంకా బీచ్ లు మాత్రమే ఉంటే చాలు ఇంకేమి అవసరం లేదు అని కంగన కుండబద్ధలు కొట్టేసింది. దీనితో ఆమె కామెంట్స్ మరోసారి హిందీ నాట వైరల్ గా మారాయి.

kangana makes shocking comments on bollywood with pushap 2

దీనికి ముందు కూడా ఆమె బాలీవుడ్‌లో కొందరు నిర్మాతలు, ప్రముఖులు ఎవరైనా కొంచెం ఎక్కువ ఫేమ్ తెచ్చుకునేలా కనిపిస్తే వారిని తొక్కేయడానికే ప్రయత్నిస్తారు అని బాలీవుడ్‌లో డార్క్ షేడ్స్‌ని రివీల్ చేసింది. కంగనా రీసెంట్‌గా నటించిన "ఎమెర్జెన్సీ" సినిమా రిలీజ్ కోసం గత ఏడాది నుంచి ట్రై చేస్తుంది కానీ ఇప్పటికీ అది ఏ పట్టాన ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. ఆ చిత్రానికి తానే దర్శకత్వం వహించడం విశేషం.

తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్‌లో కనిపించింది కంగన. గతేడాది హారర్ చిత్రం "చంద్రముఖి 2" లోనూ కంగన నటించింది. ప్రస్తుతం ఆమె సినీ, రాజకీయాలలో సాగిపోతోంది. తెలుగు సినిమా పట్ల ఇప్పటికీ తనకి సాఫ్ట్ కార్నర్ ఉంది . కానీ మళ్ళీ మరో తెలుగు సినిమా అయితే కంగన చెయ్యలేదు. మరి ఫ్యూచర్ లో ఏమన్నా తాను టాలీవుడ్‌లో అడుగుపెడుతుందో లేదో అనేది కాలమే నిర్ణయించాలి.

More from Filmibeat

Read more about: kangana ranaut prabhas pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X