ఎన్నడూ చేయని పని చేసి ఆశ్చర్యపర్చిన కంగనా.. షాకైన ఆమె సోదరి వెంటనే..
వివాదాస్పద హీరోయిన్లలో ఎప్పుడూ ముందుంటుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. సినిమాల పరంగా గానీ, వ్యక్తిగత విషయాల పరంగా గానీ ముక్కుసూటిగా మాట్లాడేయటం ఈమె నైజం. ఆ మాటలకు ఒకవేళ వివాదాలు చుట్టుముట్టినా వీరోచితంగా సమాధానం చెబుతుంటుంది కంగనా. ఇక ఈమె సోదరి రంగోలి కూడా అచ్చం కంగానా లాగే. ఏ ఇష్యు అయినా సరే కుండబద్దలు కొట్టి మాట్లాడటం, సూటిగా స్పందించడం రంగోలి స్టైల్. అయితే తాజాగా ఈ ఇద్దరూ ఈ సరి విభిన్న కోణంలో వార్తల్లో నిలవడం విశేషం.
ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ సత్తా చాటింది. ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని విజయాన్ని అందుకొని ఆశ్చర్యపర్చింది భారతీయ జనతా పార్టీ. బంపర్ మెజారిటీతో ఎవరి మద్దతూ అవసరం లేకుండానే అత్యధిక ఎంపీ సీట్లని గెలుచుకుంది బీజేపీ పార్టీ. ఇక మోడీ మరోసారి దేశంలో చక్రం తిప్పబోతున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనదైన శైలిలో బీజేపీ విజయాన్ని, మోడీ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంది. ఎన్నడూ చేయని పని చేసి తమ ఇంటి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫుల్ ఖుషీ అవుతూ ఇంట్లో వారందరికీ రుచికరమైన పకోడీలు చేసిపెట్టింది కంగనా. ఈ విషయాన్ని కంగన సోదరి రంగోలీ ట్విటర్ వేదికగా అందరితో పంచుకుంది.

ఈ మేరకు ''కంగన వంట చేయడమనేది చాలా అరుదు. తానెంతో సంతోషంగా ఉంటే తప్ప ఇలాంటి పని చేయదు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ గెలిచారన్న ఆనందంతో మాకు రుచికరమైన పకోడీలు వండిపెట్టి బాగా ఎంజాయ్ చేసింది. జై హింద్, జై భారత్'' అంటూ కంగనా వంట చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది రంగోలీ. ఇక మోదీ గెలుపు గురించి కంగన మీడియాతో మాట్లాడుతూ.. ''మోదీ వేసిన ప్రణాళికలన్నీ ప్రజల అభివృద్ధి కోసమే. భవిష్యత్తులో రాబోయే మార్పును మన దేశం స్వీకరించాలన్నా అందుకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మళ్లీ మోదీనే వచ్చారు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను'' అని చెప్పింది.
ఇటీవలే మణికర్ణిక చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన కంగనా ప్రస్తుతం 'మెంటల్ హై క్యా' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











