Boycott Kangana రిజర్వేషన్లపై కంగన వివాదాస్పద కామెంట్స్.. బాలీవుడ్ క్వీన్‌ను బహిష్కరించాలంటూ దుమారం!
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ మొదలైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ప్రకటించిన తర్వాత ఆమె చుట్టూ వివాదాలు పేరుకుపోతున్నాయి. బీజేపీ టికెట్ వచ్చిన తర్వాత ఆమెను ఉద్దేశించి.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చైర్ పర్సన్ స్పందిస్తూ.. మండిలో నీ రేటేంత అంటూ అభ్యంతరకరమైన కామెంట్స్ చేయడంతో వివాదం మొదలైంది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
మండి పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దిగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించిన కంగన రనౌత్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే స్పందిస్తూ.. ఆమె నటించిన రజ్జో సినిమాలోని హాట్ ఫోటోను షేర్ చేస్తూ నీ రేటు ఎంత పలికింది అంటూ దారుణంగా కామెంట్ చేసింది. అయితే దానిపై జవాబిస్తూ.. మహిళలకు ఓ హుందాతనం ఉంటుంది. దానికి గౌరవించాలి అని ఘాటుగా స్పందించింది.

అయితే మహిళల హుందాతనం గురించి కంగన పాయింట్ లేవనెత్తడంతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఇతర హిందీ సినీ తారలపై వెకిలితనంగా వారిపై కామెంట్స్ చేయడం.. అలాగే ఊర్మిలా మతోంద్కర్‌ను పోర్న్ స్టార్ అంటూ ఎద్దేవా చేయడం లాంటీ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చూసి ఆమె ద్వందనీతిని బయటపెట్టారు.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కుల రిజర్వేషన్లను ఎత్తివేయాలి. దాని వల్ల అగ్ర కులాలకు చెందిన వారు నష్టపోతున్నారు అంటూ కంగన రనౌత్ చేసిన కామెంట్‌ను బయటకు తీసి.. ఆమె కులపక్షపాతి. ఆమెను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. కంగన చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం లేపుతున్నాయి.

ఇటీవల రిజర్వేషన్లపై ఆమె మాట్లాడుతూ.. ప్రధానంగా డాక్లర్లు,ఇంజినీర్లు, పైలెట్స్ లాంటి వృత్తులో ఉండే వారు రిజర్వేషన్ల వల్ల నష్టపోతున్నారు. ఇలాంటి విధానా వల్ల ప్రతిభావంతులంతా అమెరికాకు వలసపోతున్నారు. ఇది మనకు సిగ్గు చేటు అంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అత్యంత వివాదంగా మారాయి.
అధునిక భారతంలో కుల వ్యవస్త తిరస్కరించబడింది. చిన్న గ్రామాల్లో దానిని పట్టించుకొంటున్నారు. కానీ కుల జాడ్యం ఓ శాడిస్ట్ తరహా తృప్తి. కేవలం రిజర్వేషన్లను మన రాజ్యాంగం మాత్రమే పట్టించుకొంటున్నది. వాటిని అమలు చేస్తున్నది. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది అని కంగన రనౌత్ కామెంట్స్ చేసింది. దాంతో కుల పిచ్చి ఉన్న కంగనను బహిష్కరించండి అంటూ #Boycott_Castiest_Kangana హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











