జయలిలతకు, నాకు ఒకే ఒక పోలిక.. కంగనా కామెంట్స్
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. బాలీవుడ్ ఫైర్ బ్రండ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే కంగనా ఫస్ట్ లుక్, అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అవి ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా కంగనా లేటెస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేసింది. అందులో ఈ హీరోయిన్ సాంస్కృతిక నృత్యకారిణిగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం కోసం ఆమె క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నట్లు. జయ లలిత పాత్రను పోషించడం కోసం పెద్ద పరిశోధనే చేసానంటుందీ కంగనా.
పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'జయలలిత నాలా ఉండదు. బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్ అంత అందంగా ఉంటుందో..ఆమె కూడా అంతే అందంగా ఉంటుంది. అలాంటిది ఆమె పాత్రలో నటించడం నాకు చాలా పెద్ద చాలెంజ్ అనిపించింది. ఎందుకంటే నేను గ్లామరస్ స్టార్‌ను కాదు. కాకపోతే ఆమెకు నాకు ఉన్న ఒకే ఒక పోలిక.. అనుకోకుండా నటి కావడం. సినిమాలంటేనే ఇష్టముండని జయలలిత అనూహ్యంగా వెండితెరపై కనిపించింది. నేనూ అంతే'అంటూ చెప్పుకొచ్చింది.

ఇంకా మాట్లాడుతూ.. 'సినిమాల్లో కనిపించాలని ఎప్పుడూ కలలు కనలేదు. అందుకే మేము అసాధారణ నటీమణులుగా కీర్తి గడించా'మని చెప్పుకొచ్చింది. 'సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేస్తూ ఉండటం కన్నా అంతకు మించి మరేదో ఉందని జయలలిత ఎప్పుడూ అనుకునేదేమో. అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి శక్తివంతమైన నాయకురాలిగా మారింది. ఇక నా విషయానికొస్తే.. కేవలం నటిగా కొన్ని పరిమితుల్లోనే ఉండటం ఎందుకని, నిర్మాతగానూ మారాను' అని కంగనా పేర్కొంది.


Click it and Unblock the Notifications











