రామాయణంలో సీతగా కంగన రనౌత్.. తండ్రిని ఎదురించి...
బుల్లితెరపై ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం సీరియల్ మళ్లీ మ్యాజిక్ చేస్తున్నది. లాక్‌డౌన్ పిరియడ్‌లో రామాయణం సీరియల్‌పై చర్చ జరుగుతుండగా బాలీవుడ్ నటి కంగన రనౌత్ సోదరి రంగోలి చందేల్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. రామాయణంలో సీతగా కంగన నటించిందనే విషయాన్ని చెప్పి అభిమానులు ఆశ్చర్యానికి గురిచేశారు.
అయితే రామయణం సీరియల్‌లోనో లేదా సినిమాలోనో సీతగా కంగన రనౌత్ యాక్ట్ చేసిందనుకొంటే పొరపాటే.. తాను 13 ఏళ్ల వయసులో ఉండగా.. రామాయణం అనే నాటికకు స్కూల్ వేశారు అనే విషయాన్ని రంగోలి చెప్పారు. అందులో సీతగా స్వయంగా కంగన అద్భుతమైన నారీ పాత్రను పోషించారని చెప్పింది.

అయితే తన తండ్రి ఆ నాటకాన్ని వేయవద్దని వారించినా మొండిగా దానిని వేశారు. సీతగా నటించడమే కాకుండా ఆ వయసులోనే క్యాస్టూమ్ డిజైనర్‌గా మేకప్ ఆర్టిస్టుగా పనిచేసి తన ప్రతిభను చాటుకొన్నారు అని చెప్పారు.
రామాయణం సీరియల్ టెలివిజన్‌లో ప్రసారం అవుతుండగా.. కంగన వేసిన నాటిక ఫోటోను షేర్ చేయాలని అనిపించింది. కంగన స్కూల్‌లో ఉండగా ప్రదర్శించిన రామాయణం నాటికలోని సన్నివేశం ఇది. అప్పుడు ఆమె వయసు 13 ఏళ్లు. ఆ నాటిక వేసినందుకు నాన్న బాగా తిట్టినా ఆమె లెక్కచేయలేదు అని రంగోలి ట్వీట్ చేశారు.
ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ సమయాన్ని కంగన రనౌత్ హిమచల్ ప్రదేశ్‌లోని తన సొంత ఊర్లో తన ఫ్యామిలీతో కలిసి గడుపుతున్నారు. ప్రస్తుతం తమిళంలో మాజీ సీఎం, నటి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 26న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో ఎంజీ రామచంద్రన్‌గా అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఈ చిత్రం హిందీలో కూడా రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











