twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగన రనౌత్ బాడీగార్డ్ అరెస్ట్.. పెళ్లి చేసుకొంటానని నమ్మించి అక్రమ సంబంధం..

    |

    ముంబైకి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకొంటానని చెప్పి అక్రమ సంబంధం పెట్టుకొని మోసం చేసిన వ్యవహారంలో కంగన రనౌత్ బాడీగార్డ్‌ కుమార్ హెగ్డేను అరెస్ట్ చేశారు. ముంబైలో ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశారని అందిన ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి కుమార్ హెగ్డేను అరెస్ట్ చేసినట్టు పోలీసు అధికారి తెలిపారు.

    బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు అంగరక్షకుడిగా పనిచేస్తున్న కుమార్ హెగ్డేపై ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేశాం. అతడిని మండ్యాలోని హెగ్డడహల్లిలో అరెస్ట్ చేశాం. ముంబై పోలీసులు అతడిని ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబైకి తీసుకువచ్చారు అని తెలిపారు.

     Kangana Ranauts bodyguard Kumar Hegde arrested

    తనను మోసం చేసినట్టు ఫిర్యాదు చేయగానే ముంబై నుంచి తన సొంత గ్రామం హెగ్గడహలికి పారిపోయారు. అతడి ఆచూకి తెలుసుకొని అరెస్ట్ చేశాం. తదుపరి దర్యాప్తు మొదలుపెట్టాం. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం అని ముంబై పోలీసు అధికారి తెలిపారు.

    30 సంవత్సరాల బాధితురాలు బ్యూటిషియన్‌గా పనిచేస్తున్నారు. వారం క్రితం మాకు ఫిర్యాదు చేసింది. ఎనిమిదేళ్లుగా ఒకరికొకరు తెలుసు అని పోలీస్ అధికారి వీరేంద్ర భోంస్లే తెలిపారు. గతేడాది జూన్‌లో పెళ్లి చేసుకొంటానని నమ్మించాడు. కొద్దికాలంగా ఆమెతో మాట్లాడటం మానేశాడు ఆ తర్వాత మరో యువతితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

    ఈ క్రమంలోనే బాధితురాలు తనను మోసం చేశాడని కుమార్ హెగ్డేపై ఫిర్యాదు చేశారు. అతడిపై రేప్, అక్రమ సంబంధం, చీటింగ్ అంశాలపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

    English summary
    Bollywood actress Kangana Ranaut's bodyguard Kumar Hegde arrested in Heggadahalli of Mandya district. He was cheated a women on pretext of Marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X