నిర్మాతపై హీరోయిన్ సోదరి సంచలన వ్యాఖ్యలు.. వయసొచ్చిన ఆమెతో మీరు!

వివాదాస్పద హీరోయిన్ల జాబితాలో కంగనా రనౌత్ ఒకరు. సినిమాల పరంగా గానీ, వ్యక్తిగత విషయాల పరంగా గానీ ముక్కుసూటిగా మాట్లాడుతూ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆమె నైజం. ఇక ఆమె సోదరి రంగోలీ చందేల్ అంతకంటే ఎక్కువ. ఏ ఇష్యు అయినా సరే కుండబద్దలు కొట్టేస్తూ మాట్లాడుతుంటుంది రంగోలీ. ఇదేబాటలో తాజాగా బాలీవుడ్ నిర్మాతపై ఆమె సంచలన కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే..

ఒకప్పుడు మంచి స్నేహితులే కానీ..

ఒకప్పుడు మంచి స్నేహితులే కానీ..

కంగన కుటుంబానికి, బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కుటుంబానికి మధ్య వైరం కొనసాగుతోంది. ఒకప్పుడు కంగన, మహేష్ భట్ మంచి స్నేహితులు కానీ.. ఓ సినిమాలో నటించేందుకు కంగన ఒప్పుకోలేదని మహేష్ ఆమెపై కోపం పెంచుకోవడం, కంగన నటించిన సినిమా ఓ థియేటర్‌లో ఆడుతుంటే అదే థియేటర్‌కు వెళ్లి మహేష్ కంగనపై చెప్పు విసరడం లాంటివి చేయడంతో ఈ ఇద్దరి ఇష్యూస్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిర్మాత వీడియో

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిర్మాత వీడియో

కాగా ఇటీవలే చట్టం చేయబడిన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిర్మాత మహేష్ భట్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోను ఉద్దేశిస్తూ ఆయనపై రంగోలీ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ‘‘మీలో ప్రేమ లేకపోతే ఎన్ని దేవుళ్లను మొక్కినా, సామాజిక సేవలు చేసినా, పేదలకు సాయం చేసినా, రాజకీయాల్లోకి వచ్చినా, పుస్తకాలు రాసినా మీరు చచ్చిన పాముతో సమానం. ప్రేమ లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలు రెట్టింపు అవుతూనే ఉంటాయి'' అని ఆ వీడియో ద్వారా మహేష్ చెప్పారు.

వయసొచ్చిన కూతురిని ఒళ్లో కూర్చోబెట్టుకుని..

వయసొచ్చిన కూతురిని ఒళ్లో కూర్చోబెట్టుకుని..

ఇది చూసిన కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ వెంటనే రియాక్ట్ అయింది. ‘‘మహేష్ గారు పుస్తకాలు చదవడం వల్ల పెద్ద విషయాలు మాత్రమే తెలుసుకోగలం. కానీ పెద్ద మనుషులం కాలేము. వయసొచ్చిన కూతురిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దాడుతూ ఫొటో తీయించుకున్న మీరా నీతులు చెప్పేది. మనం చేసే మంచి పనులతోనే పెద్దరికం వస్తుంది'' అని ఘాటుగా స్పందించింది.

ఇక ఇలా నటిస్తే కుదరదు

ఇక ఇలా నటిస్తే కుదరదు

''దేశం కోసం మీరేం చేశారు? ఇలా ఉదార స్వభావం ఉన్నట్లు నటిస్తే ఇక కుదరదు. మిత్రురాలా.. విదేశీయులు భారతదేశంలో అడుగుపెట్టడం నచ్చని వారే మన శత్రువులు. మనం భారతమాతను రక్షించుకుందాం'' అని రంగోలి తెలిపింది. దీంతో ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో పలు చర్చలకు తెరలేపాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X