తలైవిగా కంగనా ఫస్ట్ గ్లింప్స్.. కామెంట్లతో నెటిజన్లు హల్‌చల్

తమిళ ఆరాధ్య దైవం.. అమ్మగా కీర్తించబడిన జయలలిత మరణంతో అక్కడి ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు. సినిమాల్లో తన నటనతో, రాజకీయాల్లో తనదైన పాలనతో అందరి గుండెల్లో చోటు సంపాదించుకుంది జయలలిత. తమిళ తలైవిగా జయలలిత ఎనలేని అభిమానాన్ని సంపాదించుకుంది. జయలలిత ముఖ్యమంత్రిగా చేపట్టిన పథకాలు, పేదల పెన్నిదిగా అందరినీ ఆదరించిన అమ్మగా జనాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా అనేక చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో బాలీవుడ్ క్వీన్ జయలలిత పాత్రలో నటిస్తోన్న తలైవి చిత్రంచకచకా షూటింగ్‌ను కానిచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలింది చిత్రయూనిట్. దీనిలో భాగంగా జయలలిత తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన రోజుల నుంచి.. ముఖ్యమంత్రి తమిళ ప్రజల గుండెల్లో నిలిచిన ప్రయాణాన్ని చూపించబోతోన్నామని హింట్ వదిలినట్టు కనిపిస్తోంది.

 Kangana Ranaut Thalaivi First Glimpse

ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో కంగనాకు ప్రోస్థటిక్ మేకప్ ఎక్కువైందనే టాక్ వినిపిస్తోంది. జయలలిత సినీ కెరీర్‌లో సమయంలో కంగనా లుక్ బాగానే ఉన్నా.. అమ్మగా మారిన జయలలితగా కంగనా ఆకట్టుకోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కంగనా లుక్స్‌పై ఇలా మిశ్రమ స్పందన వస్తోండగా.. చిత్ర యూనిట్ ఏవిధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా తమిళం,తెలుగు, హిందీ మూడు భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2020 జూన్ 26న విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X