కంగన రనౌత్‌కు ‘విమాన’ కష్టాలు.. ఉద్రిక్తతల మధ్య ముంబైకి.. ఎన్ని గంటలకు చేరుకొంటారంటే!
శివసేన నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య బాలీవుడ్ నటి కంగన రనౌత్ ముంబైలో అడుగుపెట్టేందుకు సిద్దమైంది. లాక్‌డౌన్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని తన సొంత పట్టణం మనాలిలో ఉంటున్న బాలీవుడ్ క్వీన్ ప్రస్తుతం రాజకీయ వివాదంలో కూరుకుపోయారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ముంబై పోలీసులతో చోటుచేసుకొన్న వివాదంతో ఆమె వార్తల్లో నిలిచారు. అనంతరం శివసేన నేతలకు, ఆమె జరిగిన మాటల యుద్ధం తర్వాత మీడియా, సోషల్ మీడియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆమె ముంబైకి వస్తున్న నేపథ్యంలో లేటేస్ట్ అప్‌డేట్స్..

ముంబైలో భద్రతపై కంగన
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు వేలెత్తి చూపిన క్రమంలో ముంబై పోలీసుల తీరుపై కంగన రనౌత్ అనుమానం వ్యక్తం చేశారు. ముంబైలో తన భద్రత ప్రశ్నార్థకమే అంటూ కామెంట్ చేశారు. తాను కేంద్ర ప్రభుత్వ రక్షణ తీసుకొంటానని అన్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై క్యాటగిరీ రక్షణను ఏర్పాటు చేసింది.

సంజయ్ రౌత్, అనిల్ దేశ్‌ముఖ్ మాటల దాడి
ముంబైలో పోలీసుల తీరుపై విమర్శలు చేసిన కంగనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మహా హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మండిపడ్డారు. ముంబైలో కంగనకు జీవించే హక్కులేదని కామెంట్ చేశారు. అంతేకాకుండా కంగనపై దేశద్రోహం కేసు, డ్రగ్స్ కేసును నమోదు చేశారు. దీంతో శివసేనకు కంగన రనౌత్‌కు మధ్య వివాదం జోరందుకున్నది.

మనాలి నుంచి మంగళవారం రాత్రే
ముంబైకి చేరుకొనే ప్రయాణంలో భాగంగా కంగన రనౌత్ మంగళవారం రాత్రి మనాలి నుంచి బయలు దేరి మండి జిల్లాలోని తన పూర్వీకులు గ్రామానికి చేరుకొన్నారు. తన పూర్వీకుల గ్రామంలోని పురాతన ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆమె వెంట సొదరితోపాటు భద్రత సిబ్బంది ఉన్నారు.
Recommended Video

ముంబైకి మధ్యాహ్నం తర్వాత
ఇలాంటి పరిస్థితుల మధ్య కంగన రనౌత్ ముంబై చేరుకోవడానికి చాలానే కష్టాలు పడుతున్నట్టు కనిపిస్తున్నది. కులు నుంచి ముంబైకి బుధవారం ఫ్లయిట్ లేకపోవడం వల్ల రోడ్డు మార్గాన ఆమె చంఢీగడ్ చేరుకొంటారు. అనంతరం ఆమె చండీఘర్ నుంచి ముంబైకి విమానంలో చేరుకొనే అవకాశం ఉంది. బుధవారం 11 గంటల తర్వాత చంఢీగడ్ చేరుకొంటారు. ముంబైకి వెళ్లే విమానం చంఢీగడ్ నుంచి 12.20 నిమిషాలకు బయలుదేరుతుంది.


Click it and Unblock the Notifications











