twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐరన్‌ మ్యాన్‌ను తలుచుకొని కంగన రనౌత్ ఎమోషనల్.. పదవిని త్యాగం చేసి అంటూ..

    |

    ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. గుజరాత్‌లోని ఎత్తైన వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రధాని వల్లభాయ్ పటేల్ పాల్గొని ఐరన్ మ్యాన్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉక్కు మనిషికి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకొన్నారు. ఈ నేపథ్యంలో కంగన రనౌత్ ట్విట్టర్‌లో సర్దార్ సేవలను మరోసారి గుర్తు చేశారు.

    సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కీర్తిస్తూనే.. ప్రధాని పదవిని జవహర్ లాల్ నెహ్రూకు వదిలివేయడం జాతికి కలిగిన నష్టమనే విధంగా కామెంట్ చేశారు. బ్రిటిష్ పాలన నుంచి భారత్‌కు విముక్తి కలిగిన తర్వాత దేశ ప్రధాని పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ పేర్లు ప్రతిపాదించారు. నెహ్రూ మంచిగా ఇంగ్లీష్ మాట్లాడారనే భావించిన గాంధీని మెప్పించడానికి తనకు లభించే పదవిని త్యాగం చేశారు.

    Kangana Ranaut wishes on Iron Man Sardar Vallabhbhai Patel birth anniversary

    దేశం కోసం ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నష్టం జరగలేదు. కానీ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. మన హక్కులను సాధించుకోవడానికి దశాబ్దాలుగా పోరాటం చేయాల్సి వస్తున్నది అని కంగన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Kangana Ranaut wishes on Iron Man Sardar Vallabhbhai Patel birth anniversary

    అఖండ భారత్ స్థాపనకు కలలుగన్న ఐరన్ మ్యాన్ సర్ధార్ వల్లభాయ్ పటేల్‌‌ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పిస్తున్నాను. ప్రధాని పదవిని త్యాగం చేసి మీ నాయకత్వ ప్రతిభను, విజన్‌ను మాకు దూరం చేశారు. మీ నిర్ణయానికి మేము చింతిస్తున్నాం అంటూ మరో ట్వీట్‌ను కంగన రనౌత్ చేశారు.

    English summary
    Bollywood actress Kangana Ranaut wishes on Iron Man Sardar Vallabhbhai Patel birth anniversary. She tweeted that He is the real Iron Man of India, I do believe Gandhi ji wanted a weaker mind like Nehru that he could control and run the nation by keeping him in the forefront, that was a good plan but what happened after Gandhi got killed was a big disaster #SardarVallabhbhaiPatel
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X