కంగన ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్.. కంటతడి పెట్టిన బాలీవుడ్ క్వీన్
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ట్విట్టర్ అకౌంట్‌ను సస్సెన్షన్‌కు గురైంది. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకొన్న హింసాత్మక సంఘటనలపై ట్వీట్ చేసిన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోణలపై ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకొన్నది. ప్రస్తుతం కంగన వ్యవహారం వివాదంగా మారింది. ఈ వివాదం కారణం వెనుక అసలు కారణం ఏమిటంటే..
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత పలు చోట్ల కొన్ని హింసాత్మక సంఘటనలు చోటుచేసుకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఘన విజయం సాధించిన తర్వాత ఇలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయనే విషయాన్ని కంగన ప్రస్తావించింది. బెంగాల్‌లో అధ్యక్ష పాలన అమలు చేయాలని డిమాండ్ చేసింది.

కంగన రనౌత్ చేసిన ట్వీట్ ట్రెండింగ్‌గా మారింది. దాంతో నిబంధనలుకు విరుద్దంగా ట్వీట్ ఉందనే అంశంతో కంగన రనౌత్ టీమ్ అకౌంట్‌ను రద్దు చేస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ అకౌంట్‌కు 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన అకౌంట్‌ను సస్పెండ్ చేసిన అనంతంర తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో వీడియోను రిలీజ్ చేసి కంటతడి పెట్టింది.


Click it and Unblock the Notifications











