Kanguva Glimpse Review షాకింగ్‌గా వైల్డ్ పాత్రలో సూర్య వీరవిహారం.. Suriya బర్త్ డే గిఫ్ట్ ఎలా ఉందంటే?
ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా తన సొంత బ్యానర్ స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై తమిళ సూపర్ స్టార్ సూర్యతో నిర్మించిన చిత్రం కంగువా. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 14వ శతాబ్దం నాటి కథతో రూపొందిన ఈ చిత్రానికి ఆదినారాయణ స్టోరిని మధన్ కార్కీ డైలాగ్స్ అందించారు. ఈ చిత్రానికి వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫి అందించారు. హీరో సూర్య జన్మదినం సందర్భంగా కంగువ గ్లింప్స్ (Gimplse of Kanguva)ను రిలీజ్ చేశారు. Kanguva Glimpse ఎలా ఉందంటే?
విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న కంగువా సినిమాలో మరోసారి విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో ఐదు రకాల పాత్రల్లో కనిపించనున్నారు. ఆరథార్, వెంకటేర్, మందాన్‌కర్, ముకాతార్, పెరుమనతార్ అనే పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జ్ఞానవేల్ రాజాతోపాటు యువీ క్రియేషన్స్ వీ వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
సూర్య బర్త్ డే పురస్కరించుకొని కంగువా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. 14వ శతాబ్దం నాటి కథలో ఆటవిక జీవితం బ్యాక్ డ్రాప్‌లో సూర్య ఉగ్రరూపంతో కనిపించారు. మంచి యాక్షన్ ఎపిసోడ్‌తో తన ఫెర్ఫార్మెన్స్‌ను రుచి చూపించారు. కుశలమా అంటూ పలకరించాడు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, కెమెరా, ఆర్ట్ విభాగాల పనితీరు అద్బుతంగా ఉంది. గ్లింప్స్ థ్రిల్లింగ్‌గా కనిపించింది.
కంగువా చిత్రంలో సూర్య, దిశాపటానీతోపాటు యోగిబాబు, రెడిన్ కింగ్ల్సే, కోవై సరళ, ఆనంద్ రాజ్, రవి రాఘవేంద్ర, కేఎస్ రవికుమార్, బీఎస్ అవినాష్ నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 12వ తేదీ 2024లో తొలి భాగం రిలీజ్ అవుతుంది. కంగువా 2 సినిమాను ఫిబ్రవరి, మార్చిలో ప్రారంభిస్తున్నట్టు నిర్మాత జ్ఞానవేల్ రాజా తెలిపారు.

కంగువా చిత్రాన్ని 2డీ, 3డీ వెర్షన్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను మొత్తంగా 10 భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్‌ను 500 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను 80 కోట్లకు, హిందీ రైట్స్ 100 కోట్లకు అమ్మడం జరిగిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











