దిశా పటానిపై నిర్మాత భార్య షాకింగ్ కామెంట్స్ .. అంతేసేపు ఆమెని చూపించలేం

నార్త్ సినిమా నుంచి సౌత్ కి వచ్చి పాగా వేసిన హీరోయిన్స్ చాలా మందే కనిపిస్తారు. అయితే ఎన్నో ఏళ్ళు నుంచి కూడా చాలా మంది హీరోయిన్స్ హిందీ సినిమా నుంచి వచ్చి మన తెలుగు సినిమా దగ్గర సెటిల్ అయ్యారు. ఇంకొందరు అయితే మన దగ్గర పీక్ స్టేజ్ చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినవారు కూడా ఉన్నారు.

అయితే ఇపుడు మళ్ళీ హిందీ సినిమా నుంచి ఒకో స్టార్ హీరోయిన్ మన దగ్గరకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలా వచ్చిన వారిలో రీసెంట్ గా హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ దేవరతో పరిచయం అయ్యి అందాల విందు అందించింది. ఈమె మాత్రమే కాకుండా మరో హాట్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ దిశా పటాని కూడా సౌత్ లో ఒకటి కాదు రెండు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

kanguva producer wife shocking statement on disha patani

పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం "కల్కి 2898 ఎడి"లో దిశా పటానీ నటించారు. ఈ సినిమా ముందు రిలీజ్ కాగా.. తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో వచ్చిన హై బడ్జెట్ యాక్షన్ సినిమా "కంగువా" లో కూడా దిశా పటాని నటించింది. ఇలా రెండు సినిమాల్లో ఆమె కనిపించింది. అయితే కంగువా విషయంలో మాత్రం ఆమెకి అన్యాయం జరిగింది అనే టాక్ కూడా బాగానే వినిపించింది.

ఈమెని కేవలం గ్లామర్ కోసం మాత్రమే తీసుకున్నారని ఇంకా ఏవో క్రింజ్ సీన్స్ లాంటి వాటిలోనే దిశా కనిపించింది అనే మాటలు వినిపించాయి. అయితే అసలు ఈ సినిమాలో దిశా పటాని ప్రెజెన్స్ కోసం సినిమా నిర్మాత కే జె జ్ఞానవేల్ భార్య నేహా చేసిన షాకింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

kanguva producer wife shocking statement on disha patani

కంగువా లో ఏంజెలా(దిశా చేసిన రోల్) పాత్ర కోసం కంగువా సినిమా మొత్తం కాదు, మా రెండున్నర గంటల సినిమాలో ఏంజెలా ఒక్క దానినే మేము చూపించలేము. కేవలం ఎక్స్‌పోజింగ్‌కు మాత్రమే దిశా పటానీని దర్శకుడు విజన్ చేసుకున్నారు, అలానే ప్రెజెంట్ చేసారని నేహా అన్నారు. అయితే తాము విమర్శలు తీసుకుంటాము కానీ ఇలాంటి ప్రాపగాండలు సహించం అంటూ నేహా జ్ఞానవేల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

kanguva producer wife shocking statement on disha patani

దీనితో సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఇది దిశా ఫ్యాన్స్ కి కొంచెం హర్టింగ్ గా అనిపించొచ్చు కానీ ఆమె చెప్పిన మాటల్లో కూడా వాస్తవం లేకపోలేదు. కథ మొత్తం మేజర్ గా నడిచేది సూర్య పాత్ర మీదే కాబట్టి ఏ హీరోయిన్ కి అయినా స్కోప్ తక్కువే ఉంటుంది. అయితే ఇంత చిన్న రోల్ కి కూడా దిశా పటాని మాత్రం భారీ రెమ్యునరేషన్ ని తీసుకున్నట్టుగా పలు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి ఏకంగా ఆమెకు రూ. 5 కోట్లు చెల్లించారు అని కోలీవుడ్ టాక్.

More from Filmibeat

Read more about: disha patani kanguva suriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X