కరోనా సోకినా.. కనికా కపూర్‌ను దారుణంగా వెంటాడారు.. షాకింగ్ విషయమే!

బాలీవుడ్‌లో కరోనా సోకిన తొలి సెలబ్రిటీగా కనికాకపూర్ వివాదంలో కూరుకుపోయారు. దాదాపు 21 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. మూడు సార్లకుపైగా పాజిటివ్‌గా తేలడంతో ఆమె ఆరోగ్యం గురించి అందరికీ ఆసక్తి ఎక్కువైంది. అయితే కరోనా సోకిన కనికా కపూర్‌ గురించి ఇంటర్నెట్‌లో తెలుసుకోవడానికి నెటిజన్లు అత్యంత ఉత్సాహం చూపారనే విషయం తాజా డేటాలో వెల్లడైంది.

గూగుల్‌లో ఆమెను వెంటపడి వెతికారని డేటాను యాహూ ఇండియా విడుదల చేసింది. ఇంటర్నెట్‌లో కనికా కపూర్ కోసం మార్చి నెలలో విపరీతంగా వెతికారు. ప్రియాంక చోప్రా, రజనీకాంత్‌ కంటే ఎక్కువగా కనికా గురించే తెలుసుకోవాలని ప్రయత్నించారు అని యాహు వెల్లడించింది.

 Kanika Kapoor, Ramayan most searched Internet entities

కనికా కపూర్ మోస్ట్ సర్చ్‌డ్ సెలబ్రిటీగా రికార్డులకెక్కింది. మహిళా, పురుష సెలబ్రిటీలలో ఆమెనే టాప్‌గా నిలిచింది. లాక్‌డౌన్‌లో కనికా కపూర్ ఎవరు? ఆమె వివరాలు ఏమిటి? కరోనా సోకిన తర్వాత ఆమె పరిస్థితి ఏమిటి? అనే కోణంలో వెతికినట్టు సమాచారం.

ఇక వినోద రంగంలో కనికా కపూర్ తర్వాత రామాయణం సీరియల్ గురించి విశేషంగా శోధించారని యాహూ అధ్యయనంలో వెల్లడైంది. స్వర్గీయ రామానంద సాగర్ దర్శకత్వం వహించిన రామాయణం సీరియల్‌ను లాక్‌డౌన్‌లో దూరదర్శన్‌లో పున: ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఉదయం 9 గంటలకోసారి.. రాత్రి 9 గంటలకోసారి ప్రసారం చేస్తున్నారు. ఈ సిరియల్ గురించి కూడా బాగా వెతికినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X