సింగర్ కనికా కపూర్ కరోనావైరస్.. రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు.. ఏం జరిగిందంటే
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన ఆమెకు కరోనా వైరస్ బారిన పడటం, అదే సమయంలో లక్నోలో మూడు విలాసవంతమైన, సుమారు 400 మందికి పైగా పాల్గొన్న విందులో పాల్గొనడం వివాదంగా మారింది. వసుంధరరాజే సింధియా కుమారుడు దుష్యంత్ సింగ్ ఏర్పాటు చేసిన విందుకు కనికా కపూర్ హాజరుకావడం, ఆ కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలు కూడా పాల్గొనడంతో వారందరూ వివాదంలో కూరుకుపోయారు.

లక్నోలో దుష్యంత్ సింగ్ ఏర్పాటు చేసిన విందులో కనికా కపూర్ హాజరు కావడం, ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలడం జరిగింది. ఆ తర్వాత దుష్యంత్ సింగ్ లోక్‌సభకు హాజరయ్యారు. అంతేకాకుండా రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సభలో ఆయన పక్కన కూర్చొని ఉన్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా ఈ విషయం తెలిసి గృహనిర్భంధంలోకి వెళ్లారు.
అలాగే రెండు రోజులపాటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో దుష్యంత్ సింగ్‌తో పాల్గొన్న టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్, అప్నాదళల్ ఎంపి అనుప్రియా పటేల్, కాంగ్రెస్ నేత దీపెందర్ హుడా కూడా దుష్యంత్ సింగ్‌ను కలిశారు. ఈ క్రమంలో వీరింతా గృహనిర్భంధంలోకి స్వయంగా వెళ్లారు.

దుష్యంత్ సింగ్‌తో రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, నారైన్ దాస్ గుప్తా కూడా కలిశారు. ఉత్తర ప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కూడా దుష్యంత్ సింగ్ ఏర్పాటు చేసిన పార్టీకి హాజరయ్యారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్‌కు కూడా దుష్యంత్ సింగ్ హాజరయ్యారు. దాంతో రాష్ట్రపతి కూడా కరోనావైరస్ సోకిందా లేదా తేల్చుకోవడానికి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











