For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆమె ఏం సాధించిందని ఇంత క్రేజ్.. ప్రియా ప్రకాశ్ వారియర్‌పై నటుడు సంచలన కామెంట్స్

  |

  ఒరు అదార్ లవ్ చిత్రంలోంచి విడుదలైన టీజర్.. భారతదేశాన్ని కుదిపిసేంది. కుర్రకారు హృదయాలను షేక్ చేసింది. ఈ చిత్రంలోని కన్నుగీటే సీన్, ముద్దు గన్ను పేల్చడంతో సగం జనాభా చచ్చిపోయేంత పనైంది. ఆస్కార్ అవార్డు గెలిచిన రాని పాపులారిటీ ఆ ఒక్క కన్ను కొట్టే సన్నివేశంలో నటించేసరిక వచ్చేసింది. అప్పటి వరకు ఆమె పక్కింటికి కూడా తెలియని ప్రియా ప్రకాశ్ వారియర్ పేరు దేశం నలువైపులా పాకింది.

   ఊహించని చిత్రబృందం..

  ఊహించని చిత్రబృందం..

  ప్రియా ప్రకాశ్ వారియర్‌కు ఇంతటి క్రేజ్ వస్తుందని చిత్రబృందం ఊహించలేదు. దీంతో మొదటగా అనుకున్న కథను పూర్తిగా మార్చేసి.. ఈమె చుట్టే తిరిగేలా కథనాన్ని మార్చేశారు. దీంతో సినిమా కూడా ఆలస్యమవుతూ వచ్చింది. మళ్లీ మొత్తం సినిమాను మార్చేసి.. షూట్ చేయడం వల్లే లేట్ అయిందన్న వార్తలు కూడా వినిపించాయి.

   తేడా కొట్టిన క్రేజ్..

  తేడా కొట్టిన క్రేజ్..

  ప్రియాకు వచ్చే క్రేజే ఆమె పాలిట శాపంగా మారింది. కన్నుగీటు, ముద్దు గన్నును పేల్చే ఆ రెండు సన్నివేశాలు మినహా.. సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాటిని అప్పటికే ఎన్నో సార్లు చూసి ఉన్న ప్రేక్షకుల.. సినిమాలో కొత్తగా ఉంటుందని ఆశపడ్డారు. తీరా చూస్తే.. ప్రియాపై అందరూ జాలిపడాల్సిన పరిస్థితి వచ్చింది.

  అప్పటి నుంచి దూరంగానే..

  అప్పటి నుంచి దూరంగానే..

  ఒరు ఆదార్ లవ్ బెడిసికొట్టడం ఒకెత్తు అయితే.. అంత వరకు ఉన్న ఫేమ్ ఒకేసారి తుడిచిపెట్టుకుపోవడం ప్రియాను మరింత కుంగతీసింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాకు, సినీ రంగానికి దూరంగానే ఉంటూ వస్తోంది. అంతకు వచ్చిన ఆఫర్ల అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. అయితే తాజాగా కన్నడ నటుడు చేసిన వ్యాఖ్యలతో ప్రియా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

   ఏం సాధించిందని ఫైర్..

  ఏం సాధించిందని ఫైర్..

  తనతో కలిసి వేదికను పంచుకున్నందుకు కన్నడ నటుడు జగ్గేష్ ప్రియాపై ధ్వజమెత్తాడు. ఆమె ఒక రచయిత కాదు, స్వతంత్ర్య సమరయోధురాలు కాదు, దేశం కోసం ఏమీ చేయలేదు, వంద చిత్రాలకు పైగా నటించిన గొప్ప నటి కాదు, మథర్ థెరిస్సా కాదు, ప్రముఖ నవలా రచయిత త్రివేణి, ఝాన్సీ లక్ష్మీ బాయి కాదు ఆమె ఏం సాధించిందంటూ.. ఈ కార్యక్రమానికి పిలిచారని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

  #CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
  పిలిచినప్పుడు రాకపోతే ఈగోయిస్ట్..

  పిలిచినప్పుడు రాకపోతే ఈగోయిస్ట్..

  ‘ఈమె కన్నడ స్టార్ కూడా కాదు.. ఒకరికి కన్నుకొట్టి ఇంత ఫేమ్ సంపాదించుకుంది. ఇదో గొప్ప ఈవెంట్, ఒక్కలిగ ఇన్‌స్టిట్యూషన్ వార్షికోత్సవ వేడుకలకు వంద చిత్రాలకు దర్శకత్వం వహించిన సాయి ప్రకాశ్, శ్రీ నిర్మలానంద స్వామిజీ లాంటి వారు హాజరయ్యారు. ఇలాంటి ఓ నటిని తీసుకొచ్చి.. ఈ జనరేషన్‌కు ఏం స్ఫూర్తిని ఇవ్వాలని అనుకుంటున్నారు? ఈ దేశం ఎక్కడి వెళ్తోంది? ఇలాంటి యూత్ మన దేశానికి వెన్నుముక అని మనం భావిస్తున్నామా? లాంటి ప్రశ్నలు కొన్నిసార్లు నన్ను పిచ్చివాడిని చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఫంక్షన్లకు పిలిచినప్పుడు రాకపోతే.. ఈగోయిస్ట్ అంటారు.. వస్తే ఇదంతా భరించాల్సి ఉంటుంది' అంటూ ఎడాపెడా వాయించేశాడు. ప్రస్తుతం ప్రియా విష్ణుప్రియ అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది.

  English summary
  veteran Kannada actor Jaggesh recently bashed the 'Oru Adaar Love' star for sharing the dais with him during an event, implying that she has not achieved anything in her career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X