twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువ హీరో.. బ్రతికుండగానే అవయవదానం

    |

    సినిమా ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక వైపు కరోనా వైరస్ వలన రోజుకు వేల మంది మరణిస్తున్న తరుణంలో ఎంతో భవిష్యత్తు ఉన్న టాలెంటెట్ నటుడు హఠాత్తుగా మరణించడం అందరిని షాక్ కు గురి చేసింది. జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు సంచారి విజయ్ ఇటీవల యాక్సిడెంట్ కు గురయ్యాడు. అయితే హాస్పిటల్ జాయిన్ అయిన 48గంటల్లోనే అతను మృత్యువు అంచుల్లోకి వెళ్లినట్లు వైద్యులు నిర్దారించారు.

    సుశాంత్ మరణించిన రోజే..

    సుశాంత్ మరణించిన రోజే..

    నేటికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి ఏడాది పూర్తయ్యింది. నేడు దేశవ్యాప్తంగా అతని వర్దంతి సందర్భంగా అభిమానులు ప్రముఖులు అతన్ని స్మరించుకుంటున్న తరుణంలో మరొక యువ నటుడు ప్రాణాలు కోల్పోవడంతో సినిమా ప్రపంచంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

    బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడంతో

    బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడంతో

    విజయ్ జూన్‌ 12 స్నేహితుడితో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ కు గురయ్యాడు. ఆ ప్రమాదంలో తలకు అలాగే కాలికి బలమైన గాయాలు తలిగాయి. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు అపుడే పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టినట్లు చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయినట్లు కూడా చెప్పారు.

    బ్రతికుండగానే అవయవదానం

    బ్రతికుండగానే అవయవదానం

    చికిత్సకు రెస్పాండ్ అవ్వడం లేదని తెలిసిన తరువాత అతను బ్రతకడం చాలా కష్టమని వివరించిన కొద్దీ సేపటి క్రితమే మరణించినట్లు కన్నడ మీడియా పేర్కొంది. అలాగే విజయ్ బ్రతకడని తెలిసిన అనంతరం అతని అవయవాలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అతని బ్రదర్ సిద్దేష్ సంతకం చేసినట్లు తెలుస్తోంది.

    ఆ సినిమాతో నేషనల్ అవార్డు

    ఆ సినిమాతో నేషనల్ అవార్డు

    కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యువ నటుడు సంచారి విజయ్ 'నాను అవనల్ల.. అవలు' అనే సినిమాలో ట్రాన్స్‌జెండర్‌గా నటించి నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆ ఒక్క సినిమాతో అతని పేరు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది.

    సుదీప్ ఎమోషనల్ ట్వీట్

    సుదీప్ ఎమోషనల్ ట్వీట్

    విజయ్ మృతిపట్ల కన్నడ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కన్నడ హీరో కిచ్చా సుదీప్ కూడా సోషల్ మీడియాలో ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. 'విజయ్ తుది శ్వాస విడిచారని నమ్మడానికి చాలా నిరుత్సాహాన్ని కలిగించింది. లాక్ డౌన్ కంటే ముందే అతన్ని రెండుసార్లు కలుసుకున్నాను. అతని నెక్స్ట్ సినిమాపై అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరగడం బాధాకరం. వారి కుటుంబ సబ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అంటూ సుదీప్ వివరణ ఇచ్చారు.

    English summary
    Extremely tragic Talented and a great human being gone too soon. National award winning actor Sanchari Vijay is no more. Following yesterday's road mishap, the actor passed away after he failed to respond to the treatment at the hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X