బ్రేకింగ్ న్యూస్ : ఇండస్ట్రీలో మరో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న యువ హీరో
కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కన్నడ సూపర్ స్టార్ చిరంజీవి సర్జా మరణించిన విషయం ఇంకా ఎవ్వరూ మరిచిపోక ముందే మరో తార నేలరాలింది. బుల్లితెరపై క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్న సుశీల్ గౌడ(30) మరణ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న సుశీల్ మరణ వార్తతో బుల్లితెర ఉలిక్కిపడింది. సుశీల్ మరణ వార్తపై ఆయన సన్నిహితులు, అభిమానులు, సహ నటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

అది మరవక ముందే..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటనను మరవకు ముందే మరో యువతార తిరిగి రాని లోకాలకు చేరుకుంది. కన్నడ పరిశ్రమలో బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్న సుశీల్ గౌడ ఆత్మహత్య ఘటన ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. మంగళ వారం (జూలై 7) మాండ్యలోని ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

బయటకు రాని వివరాలు..
కన్నడ బుల్లితెరపై అంతపుర సీరియల్‌తో క్రేజీ స్టార్‌గా మారిన సుశీల్.. ఆత్మహత్య ఘటనపై ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.అయితే సుశీల్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా బయటకు రాలేదు. పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు.

మోడల్, ఫిట్‌నెస్ ట్రైనర్..
సుశీల్ కేవలం నటుడు మాత్రమే కాదు. మోడల్‌గా, ఫిట్‌నెస్ ట్రైనర్‌గానూ ఎంతో ఫేమస్. ఈ మధ్యే వెండితెరపైనా మెరిసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దునియా విజయ్ హీరోగా వస్తోన్న సాలాగా చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాడు.
Recommended Video

షాక్‌లో కన్నడ చిత్రసీమ..
చిరంజీవి సర్జా మరణాన్ని జీర్ణించుకోవడమే కష్టంగా ఉండటంతో.. అంతలోనే మరో యువతార మరణం అందర్నీ కుదిపేసింది. వెండితెరపై ఎంతో భవిష్యత్తు ఊహించుకున్నాడని, అంతలోనే ఇలా జరిగిందని సన్నిహితులు అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











