కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం.. వీడియోతో బ్లాక్ మెయిల్.. నటి ఫిర్యాదు
కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిసి ఇవ్వడం, ఆపై అత్యాచారం చేయడం, ఇంకొందరు వాటిని చిత్రీకరించి డబ్బులు కాజేయడం ఎన్ని సినిమాల్లో చూసి ఉంటారు. అయితే అలాంటి పథకంలో వలకు చిక్కిన చేప పిల్లలా ఓ కన్నడ నటి పడింది. కార్పోరేట్ కంపెనీ సీఈఓ అని చెప్పి మోసం చేయడం, అత్యాచారం చేసి వీడియోలో చిత్రీకరించడం, డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం.

అలా పరిచయం..
2018 లో గాంధీబజార్ కాఫీడేకు వెళ్లిన సమయంలో ఆ కన్నడ నటికి నాయండహళ్లికి చెందిన మోహిత్ అనే వ్యక్తితో పరిచయమైంది. అతను ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓ అని చెప్పి దగ్గరయ్యాడు. తన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని కోరాడు.

అలా క్లోజ్..
అలా అలా వారిద్దరు క్లోజ్ అయ్యారని తెలుస్తోంది. గతేడాది జనవరి 15న గోవాకు తీసుకెళ్లి ఫొటోషూట్ చేశాడు. కంపెనీలో ఆర్థిక సమస్యలంటూ రూ.1.50 లక్షలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది జూన్ 22న నటి ఇంట్లోనే తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. మరుసటి రోజు నటి పుట్టినరోజు కావడంతో ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.

మత్తుమందు కలిపి..
ఆ పార్టీలో ఆ నటికి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి భద్రపర్చుకున్నాడు. ఆపై ఆ వీడియోను చూపి డబ్బు ఇవ్వాలని లేకపోతే సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించాడు.

పలుమార్లు డబ్బులు..
వీడియోను చూపిస్తూ పలుమార్లు డబ్బులు గుంజాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మొత్తంగా రూ.20లక్షలు ఆమె దగ్గరి నుంచి కాజేశాడని సమాచారం. ఈ ఘటన తనకు సాయం చేస్తారన్న ఆశతో ఈ విషయాన్ని బాధితురాలు నిందితుడి తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా బెదిరింపులకు పాల్పడ్డారు.

అందరిపై కేసు నమోదు..
దీంతో విసిగిపోయిన ఆ నటి మోహిత్‌తో పాటు అతడి తల్లిదండ్రులు మహాదేవ్, నాగవేణితో పాటు బంధువు రాహుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మోహిత్ కోసం గాలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











