ఇండస్ట్రీలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి కుమారుడు మృతి!
సినిమా పరిశ్రమలో వరుస రోడ్డు ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు సంచారి విజయ్ బైక్ మీద ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి మరణించారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆ ప్రమాదాలు మరువక ముందే
సంచారి విజయ్ యాక్సిడెంట్ జరిగి మరణించిన కొద్ది రోజులు కూడా కాకముందే తెలుగు ఇండస్ట్రీకి చెందిన సినీ విమర్శకుడు నటుడు దర్శకుడు కత్తి మహేష్ కూడా ఒక పెద్ద ప్రమాదానికి గురయ్యాడు.. ప్రస్తుతం ఆయన అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు అయితే ఆయన పరిస్థితి ప్రస్తుతానికి మెరుగ్గానే ఉన్నా మరి కొన్నాళ్ళపాటు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఉందని అంటున్నారు.

దర్శకుడి కుమారుడు
ఇలాంటి తరుణంలో కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు జగ్గేష్ కుమారుడు కూడా రోడ్డు ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. అయితే తాజాగా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీకి చెందిన మరో నటుడి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు కన్నడ తుళు భాషల్లో సినిమాలు చేసే సూర్యోదయ్ పెరంపల్లి అనే దర్శకుడి కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

వాటర్ టాంకర్
20 ఏళ్ల సూర్యోదయ్ పెరంపల్లి కుమారుడు మయూర్ శుక్రవారం నాడు రోడ్డు ప్రమాదానికి గురి కాగా శనివారం నాడు అర్ధరాత్రి మరణించినట్లుగా పోలీసులు వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు మృతుడు మయూర్ బైక్ మీద వెళ్తుండగా ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంకర్ ను డీ కొన్నాడని ఈ క్రమంలోనే ఆయన కు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం.

చాలా స్పీడ్ తో
మయూర్ యాక్సిడెంట్ అయిన సమయంలో చాలా స్పీడ్ గా బండి తోలుతున్నట్లు పోలీసులు గుర్తించారు. "అతను అతి వేగంగా 300 సిసి మోటార్ బైక్ నడుపుతుండగా, అతను వెనుక నుండి ఈ ట్యాంకర్ను డీ కొన్నాడని పేర్కొన్నారు.
Recommended Video

ఆ సినిమా సూపర్ హిట్
ఇక పెరంపల్లి సూపర్ హిట్ తులు చిత్రం 'దేయి బైదేతి - గెజ్జెగిరి నందనోడు' ను నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ సినిమా మూడు రాష్ట్ర అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రోత్సాహంతో, పెరంపల్లి 2021 ఫిబ్రవరిలో కన్నడలో సాల్ట్ అనే కామెడీ-క్రైమ్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications