స్టార్ సింగర్ పై నిషేధం.. అతనిపై భగ్గుమంటున్న కన్నడ చిత్ర పరిశ్రమ

బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్ పై బెంగళూరులో కేసు నమోదైంది. కాశ్మీర్ లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కర్ణాటకలోని బెంగళూరు నగరంలో నిర్వహించిన తలపెట్టిన ఆయన లైఫ్ పెర్ఫామెన్స్ ఈవెంట్ ను రద్దు చేశారు. కన్నడిగుల మనస్సు నొప్పించేలా ఆయన ప్రవర్తించినందుకే ఆయనపై కేసు నమోదైంది. ఆయన ప్రవర్తనతో కన్నడ చిత్ర పరిశ్రమ పూర్తిగా కన్నెర్రజేసింది. తాజాగా నిర్వహించిన సమావేశంలో ఆయనపై నిషేధం కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ పై ఎందుకు కేసు నమోదైంది? బెంగళూరు కన్సర్ట్ లో ఏం జరిగింది? కన్నడిగులు ఎందుకు హర్ట్ అయ్యారనే వివరాల్లోకి వెళితే..

సోనూ నిగమ్ బెంగళూరుకు ఎందుకు వెళ్లారు?
సోనూ నిగమ్ ఎక్కువ హిందీ పాటలతో పాటు కన్నడ భాషల చిత్రాలకు పాటలు పాడారు. దాంతో ఆయనకు కర్ణాటకలోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన పాటల కచేరికి వేల సంఖ్యలో సంగీత ప్రియులు తరలిస్తూ వస్తుంటారు. ఈక్రమంలో రీసెంట్ గా బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజీలో కన్సర్ట్ ఏర్పాటు చేశారు. ఈ కన్సర్ట్ కు హాజరయ్యేందుకే సోనూ నిగమ్ బెంగళూరుకు వెళ్లారు. కానీ వివాదం చిక్కుకున్నారు.

Kannada Film Industry ban on Popular Singer Sonu Nigam

స్టార్ సింగర్ పై ఎఫ్ఐఆర్..
బెంగళూరులోని ఆ కాలేజీలో ఏర్పాటు చేసిన కచెరీలో వేదికపై సోనూ నిగమ్ హిందీ పాటలు పాడటం ప్రారంభించాడు. దీంతో కొంత మంది కన్నడిగులు సోనూ నిగమ్ హిందీ సాంగ్స్ పాడటం ఆపి కన్నడ భాషలోని పాటలు పాడాలని కోరారు. దాంతో సోనూ నిగమ్ కాస్తా సీరియస్ అయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. దాంతో కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు అధ్యక్షుడు సోనూ నిగమ్ స్పందించిన తీరు కన్నడ సమాజాన్ని కించపరిచేలా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సోనూ నిగమ్ పై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారంలోగా బెంగళూరు డిస్ట్రిక్ట్ పోలీసు కార్యాలయంలో హాజరు కావాలని సమన్లు పంపారు. దానికి సోనూ నిగమ్ అంగీకరించారు.

కన్నడ చిత్ర పరిశ్రమ ఏం తేల్చింది?
కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెంటనే సోనూ నిగమ్ వివాదంపై సమావేశం నిర్వహించింది. ఇందులో సంగీత దర్శకుల సంఘం, దర్శకుల సంఘం, నిర్మతాల సంఘం కూడా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఎం నర్సింహులు మాట్లాడుతూ.. సోనూ నిగమ్ కన్నడ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పే వరకు అతనిని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. కన్నడ చిత్రాలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకూ ఆయన్ని ఆహ్వానించవద్దని తీర్మాణం చేశారు. ఇదే విషయమై బెంగళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి కూడా లేఖ పంపిస్తామని నర్సింహులు చెప్పారు.

6000 పాటలకు సోనూ నిగమ్ గాత్రం..
ఇండియాలోనే స్టార్ సింగర్ గా సోనూ నిగమ్ గుర్తింపు దక్కించుకున్నారు. ఏకంగా 32 భాషల్లో ఆయన పాటలు పాడారు. దీంతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. సంగీత ప్రపంచంలో 32 ఏళ్లు పాటలు పాడుతూనే వస్తున్నారు. అనేక భాషల్లో తన ఆల్బమ్స్ ను కూడా విడుదల చేశారు. హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు, తమిళం, బెంగాలీ, సంస్కృతం, మరాఠీ వంటి ఎన్నో చిత్రాల్లో పాటలు పాడారు. ఆయన కెరీయర్ లో ఇప్పటి వరకు 6000కు పైగా పాటలు పాడి రికార్డు క్రియేట్ చేశారు. ఇక సోనూ నిగమ్ చాలా వేగంగా పాటలు పాడగలడు. ఒక వేదికపై 4 నిమిషాల్లోనే 27 పాటలు పాడి రికార్డు క్రియేట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X