అరవిందుడికి మూడో భామ.. అంటగట్టిన త్రివిక్రమ్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న అరవింద సమేత చిత్రం దసరా విడుదలకు ముస్తాబవుతున్నది. బిజీగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, ఇషా రెబ్బా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లు అనే విషయం ప్రచారమవుతున్నది.
ఓ మై గాడ్, అనగనగా ఒక చిత్రం, ఖాకీలో నటించిన కన్నడభామ మేఘ శ్రీ ఈ చిత్రంలో నటించిందనే వార్తలు ఫిలింనగర్‌లో గుప్పుమంటున్నాయి.
అరవింద సమేత కథలో భాగంగా ఓ కీలక సన్నివేశంలో మేఘా శ్రీ నటించిందని, కొద్ది రోజుల క్రితం ఆమెకు సంబంధించిన సీన్లు షూట్ చేసినట్టు తెలిసింది.

ఇప్పుడు ఇద్దరితో సరిపెట్టుకునే ఎన్టీఆర్‌కు మూడో హీరోయిన్ అవసరం ఏముంటుందా అనే అంశం చర్చనీయాంశమైంది. ముగ్గురు భామలతో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తారో చూద్దామనే ఆలోచనలో ఫ్యాన్స్ పడిపోయారు.
రాయలసీమ ఫ్యాక్షన్ కథా నేపథ్యంతో రూపొందుతున్న అరవింద సమేత.. వీర రాఘవ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











