మర్డర్ కేసులో యువ హీరోయిన్ అరెస్ట్.. అఫైర్‌కు అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడినే హత్య.. ముక్కలుగా నరికి...

క్షణికావేశంలో అయిన వారిని కూడా చంపడానికి వెనుకాడడం లేదు కొందరు. తాజాగా ఒక హీరోయిన్ చేసిన పని సభ్యసమాజం తలదించుకునేలా విధంగా ఉంది. ఒక వ్యక్తితో ప్రేమ మైకంలో నిండా మునిగిపోయిన ఒక హీరోయిన్ సొంత తమ్ముడిని దారుణంగా చంపేసింది. వినడానికి ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉన్న ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమలో చోటు చేసుకుంది.

కర్ణాటక రాష్ట్రం బెంగళూరు శాండల్ వుడ్ పరిశ్రమలో హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఒక భామ ఒక సినీ సెలబ్రిటీ మేనేజర్ తో ప్రేమలో పడింది. ఈ విషయం ఆమె తమ్ముడికి నచ్చలేదు, అతనితో తిరగవద్దు అంటూ హెచ్చరించాడు. ఈ విషయం నచ్చని సదరు హీరోయిన్ తన ప్రియుడితో కలిసి తమ్ముడిని అతి దారుణంగా చంపేసింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఎయిర్ హోస్టెస్ టు హీరోయిన్

ఎయిర్ హోస్టెస్ టు హీరోయిన్

ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్న సమయంలో జరిగిన మిస్ కర్ణాటక పోటీల్లో పాల్గొన్న శనయా ఆ పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ కర్ణాటక కిరీటం దక్కించుకున్న శనయా తరువాత మంచి గుర్తింపు తెచ్చుకుని సెలబ్రిటీ అయిపోయింది. మిస్ కర్ణాటక కిరీటం దక్కించుకున్న తర్వాత శనయా కట్ వే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి కన్నడలో హీరోయిన్ గా మారింది. ఈమె ఒక చిన్న తెలుగు సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.

ప్రేమలో మునిగిపోయి

ప్రేమలో మునిగిపోయి

ఇదమ్ ప్రేమం జీవనం, ఒందు గంటేయ కథ(ఒక గంట కథ) చిత్రాల్లో నటించిన శనయా కాట్వే, ప్రముఖ సెలబ్రిటీ మేనేజర్ నియాజ్ అహ్మద్‌తో ప్రేమలో ఉంది. ఇద్దరూ తరచూ కలిసి మీడియాకి కూడా చిక్కారు. వారి వ్యవహారం నచ్చని శనయా సోదరుడు రాకేష్ ఆమెను అతనితో తిరగవద్దని హెచ్చరించాడు. నియాజ్ అహ్మద్‌ కి దూరంగా ఉండమని అతను శనయాను పదేపదే వేడుకున్నాడు. రాకేష్ తమ ప్రేమ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడని, భవిష్యతులో తమ ప్రేమకు అడ్డొచ్చేలా ఉన్నాడని శనయా, ఆమె ప్రియుడు నియాజ్‌ ఆందోళన చెందారు. అతడిని అడ్డు తొలగించాలని స్కెచ్‌ వేసి చంపేశారు.

దారుణంగా నరికి ముక్కలు ముక్కలు చేసి

దారుణంగా నరికి ముక్కలు ముక్కలు చేసి

ముందు స్కెచ్ వేసుకుని ఆ స్కెచ్ ప్రకారం నియాజ్‌ అహ్మద్‌, అతడి స్నేహితులు రాకేష్‌ ను దారుణంగా చంపిసి, శవాన్ని కారులో దాచిపెట్టారు. అయితే రోజులు గడిచిన కొద్దీ కానీ ఆ కారులో నుంచి దుర్వాసన వస్తే పోలీసులకు దొరికిపోతామని నియాజ్‌ అహ్మద్‌, అతడి స్నేహితులు భయపడిపోయారు. దీంతో రాకేష్‌ శవాన్ని తల, మొండెం, కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలుగా కోసి కర్ణాటకలోని హుబ్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ విసిరేశారు. రాకేష్ మిస్సింగ్ అని ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతని సెల్ ఫోన్ ద్వారా ట్రాకింగ్ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ తమ్ముడనే క్రమంలో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడు నియాజ్‌ అని గుర్తించారు. అతడిని అరెస్ట్‌ చేసి విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Recommended Video

Rashmika Mandanna అంటే అంత కోపం ఎందుకు ? Rashmika Biography
నాకేం పాపం తెలీదు

నాకేం పాపం తెలీదు

ఈ హత్య కేసులో హీరోయిన్‌కు కూడా సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆమెను కూడా అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ శనయా ఈ హత్యతో తనకు సంబంధం లేదని చెబుతోంది. తన తమ్ముడితో వివాదాలు ఉన్న సంగతి నిజమే కానీ ఈ హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదని తనను కావాలనే ఇరికిస్తున్నారని ఆమె వాపోతోంది. ఈ అంశం కర్ణాటకలోనే కాక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి చూడాలి ఏమవుతుందో ?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X