Jr NTR: వేదికపై ప్రముఖ మహిళ కోసం కుర్చీలు తుడిచిన ఎన్టీఆర్.. ఆ మాటలకు కన్నడ రాష్ట్రం ఫిదా!

జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటూ ఉండడం సాధారణమనే చెప్పాలి. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కన్నడ రాష్ట్రంలో కూడా అతనికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రజ్యోత్సవ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ రజనీకాంత్ గెస్టులుగా వెళ్లారు. అయితే ఆ వేడుకలో పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్ అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ వేదికపై కుర్చీలు తుడిచిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాలలోకి వెళితే..

ఎన్టీఆర్ ను ప్రత్యేక అతిథిగా

ఎన్టీఆర్ ను ప్రత్యేక అతిథిగా

జూనియర్ ఎన్టీఆర్ పునీత్ రాజ్ కుమార్ కు ఎంతో సన్నిహితమైన స్నేహితుడు అని చెప్పవచ్చు. చాలా ఇంటర్వ్యూలలో పునీత్ రాజ్ కుమార్ ఎన్టీఆర్ తనకు ఒక సోదరసమానులు అంటూ వివరణ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్ పునీత్ సినిమాలో కూడా ఒక పాట పాడిన విషయం తెలిసిందే. ఇక కన్నడ రజ్యోత్సవ కార్యక్రమంలో పునీత్ రాజ్ కుమార్ కు అవార్డును కూడా ప్రకటించగా ఆ వేడుకకు ఎన్టీఆర్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు.

 ఎన్టీఆర్ కు ఘన స్వాగతం

ఎన్టీఆర్ కు ఘన స్వాగతం

ప్రత్యేకమైన ఫ్లైట్ లో జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక రాష్ట్రంలో అడుగుపెట్టగానే ఆ రాష్ట్రం ప్రముఖ మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఇక వేదిక దగ్గరికి తీసుకు వెళ్లే వరకు కూడా భారీ కాన్వాయ్ తో బందోబస్తు అందించారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు అని తెలియగానే అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక రజనీకాంత్ కూడా ఆ వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

వర్షం పడుతున్నా ఆగని ఎన్టీఆర్ స్పీచ్

వర్షం పడుతున్నా ఆగని ఎన్టీఆర్ స్పీచ్

అయితే సభ పైన జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుక ప్రారంభం అయ్యేలోపే అప్పటికే వర్షం మొదలయ్యింది. అయినప్పటికీ కూడా వేడుకను అలాగే నిర్వహించారు. వర్షాన్ని లెక్కచేయకుండా ఎన్టీఆర్ కూడా తన మాటలను అలాగే కొనసాగించారు. పునీత్ రాజ్ కుమార్ స్నేహితుడిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను అలాగే ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ నిజంగా గొప్ప రాజు అని తారక్ వివరణ ఇచ్చాడు.

ఏకైక రాజు పునీత్ రాజ్ కుమార్

ఏకైక రాజు పునీత్ రాజ్ కుమార్

ఒక వ్యక్తికి ఇంటి పేరు అనేది వారసత్వంగా వస్తుంది కానీ ఎలాంటి అసూయ లేకుండా అహంకారం, అహం లేకుండా యుద్ధం లేకుండా ఈ రాజ్యం మొత్తం తనదే అని స్వయంగా గెలుచుకున్న ఏకైక రాజు పునీత్ రాజ్ కుమార్ అని ఎన్టీఆర్ గొప్పగా చెప్పడంతో అభిమానులు అందరూ కూడా సంతోషపడ్డారు. అతనిలో ఒక గొప్ప నటుడు మాత్రమే కాకుండా గొప్ప తండ్రి గొప్ప స్నేహితుడు గొప్ప డాన్సర్ అలాగే గొప్ప సింగర్ కూడా ఉన్నాడు అని అలాంటి స్వచ్ఛమైన స్మైల్ ఉన్న హీరోను ఎక్కడ చూడలేదు అని అన్నాడు.

కుర్చీలు తుడిచిన ఎన్టీఆర్

ఇక జూనియర్ ఎన్టీఆర్ తో పాటు సభ పైన ఇన్ఫోసిస్ చైర్మన్ సుధా మూర్తి కూడా హాజరయ్యారు. అయితే ఆమె కుర్చీలో కూర్చోబోతుండగా జూనియర్ ఎన్టీఆర్ కుర్చీ పైన వర్షపు నీళ్ళు పడి ఉండడంతో తనే స్వయంగా బట్ట తీసుకొని తుడిచాడు. ఆమెను ఎంతో గౌరవంగా కుర్చీలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాడు. ఇక ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి మంచి వేడుకకు పిలిచినందుకు కర్ణాటక రాష్ట్రం ముఖ్యమంత్రికి ప్రజానేతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు ఎన్టీఆర్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X