మాలాశ్రీ,, విజయశాంతి అంతటి హీరోయిన్.. పోలీస్ పటాస్ హిట్ సినిమా.. ప్రముఖుల ప్రశంసలు

భీమవరం టాకీస్ 97వ సినిమా పోలీస్ పటాస్ ప్రమోషనల్ ట్రైలర్ సోమవారం (ఆగస్టు 5వ తేదీన) నిర్మాత సీ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైంది. కన్నడలో ఏడు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తెలుగు అమ్మాయి ఆయేషా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో ప్రాణాలకు తెగించి ఆయేషా ఫైట్లు చేశారు. ఈ సినిమా టీజర్లను, ట్రైలర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కలర్స్ చిప్స్ అధినేత సుదీప్ రాంబోట్ల, కథా రచయిత జేకే భారవి, నిర్మాత సాయి వెంకట్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ... నా శిష్యుడు రామసత్యనారాయణ ఇది 97వ సినిమా అంటున్నాడు. కానీ నాకు తెలిసి అతను తన 100వ సినిమాను శతాధిక దర్శకుడితో ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా చేసే వరకు తాను 97, 98వ సినిమా చేస్తున్నానని అంటాడు. ఏదీ ఏమైనా తాను నిర్మించబోయే అన్నీ సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇక హీరోయిన్ ఆయేషా తెలుగు అమ్మాయి. తిరుపతికి చెందిన వారు. తెలుగులో నుంచి కన్నడకు వెళ్లి సక్సెస్ కావడం చాలా కష్టం. ఈ చిచ్చరపిడుగు మాలాశ్రీ, సాయి కుమార్ తర్వాత అంతటి సక్సెస్ అందుకొన్నారు. నటనకు, యాక్షన్, ఓరియెంటెడ్ సినిమాల్లో రాణిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరింత క్రేజ్ సంపాదించుకోవాలని కోరుకొంటున్నాను అని అన్నారు.

 Kannada Star Ayeshas Police Patas teaser released by C Kalyan

నిర్మాత రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ.. నేను సినిమాలు తియ్యడం నేర్చుకుంది సి.కళ్యాణ్ గారి దగ్గరే, పోలీస్ పటాస్ సినిమా అయేషా చక్కగా నటించింది. ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడుతుంది. విజయశాంతి తరువాత అంత గొప్ప పేరు సంపాదించుకుంటుంది ఈ అమ్మాయి పోలీస్ పటాస్ అందరికి నచ్చే గొప్ప సినిమా అవుతుంది' అన్నారు.

 Kannada Star Ayeshas Police Patas teaser released by C Kalyan

సుధీష్ గారు మాట్లాడుతూ... ఒక్క సినిమా ప్లాప్ అయితే నిర్మాతలు కనుమరుగవుతారు, కానీ నిర్మాత రామసత్యనారాయణ గారు క్వాలీటితో కూడిన ఇన్ని సినిమాలు వరుసగా అందిస్తూ చక్కటి చిరునవ్వుతో ఉన్నారు చాలా సంతోషం'అన్నారు

మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ... కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన అయేషా ఈ సినిమాలో నటించడం విశేషం. రామసత్యనారాయణ మంచి చిత్రాలు నిర్మిస్తూ చిన్న నిర్మాతలకు రోల్ మెడల్ ఉన్నారు'అన్నారు.

 Kannada Star Ayeshas Police Patas teaser released by C Kalyan

నటీనటులు: అయేషా, రవికాలే, నిరంజన్ తదితరులు

సాంకేతిక నిపుణులు
సంగీతం: శ్రీ వాస్తవ్
కథ: నాగేశ్వర రావు
పి.ఆర్.ఓ: వీసా మధు
సాహిత్యం: బాల త్రిపుర సుందరి
నిర్మాత: రామసత్యనారాయణ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X