"ఐ లవ్ యు"... ఉపేంద్ర నుంచి మరో బోల్డ్ మూవీ, రిలీజ్ డేట్ ఫిక్స్!

కన్నడ స్టార్ ఊపేంద్ర సినిమా అంటే మామూలుగా ఉండదు. రోటీన్‌కు భిన్నంగా ఉండే ఆయన సినిమాలకు ఆదరణ కూడా అదే స్థాయిలో ఉంటుంది. త్వరలో మరో సెన్సేషనల్ మూవీతో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'ఐ లవ్ యు' టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహించారు.

తెలుగులో ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేస్తున్నారు. జూన్ 8న విశాఖపట్టణం సముద్రతీరంలో ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన డింపుల్ క్వీన్ రచిత రామ్ హీరోయిన్‌గా నటిచింది.

Kannada star Upendras I Love You releasing on June 14

డైరెక్టర్ ఆర్‌. చంద్రు శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించారు. ఉపేంద్ర సినిమాల నుంచి ప్రేక్షకులు ఎలాంటి ఎంటర్టైన్ మెంట్ కోరుకుంటారో అలాంటి అంశాలతో పాటు లవ్, ఫ్యామిలీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని జోడించి తెరకెక్కించారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం చేసిన కామెడీ మరో హైలైట్‌గా నిలుస్తుందని, చాలా కాలం తర్వాత ఆయన తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించబోతున్నారట. హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఎరోటిక్, బోల్డ్ సీన్స్ సినిమాలో హైలైట్ అవుతాయని, వీరిపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్.

Kannada star Upendras I Love You releasing on June 14

ఈ చిత్రంలో ఇంకా సోను గౌడ, బ్రహ్మానందం, హోనవళ్ళి కృష్ణ, జై జగదీష్‌, పీడీ సతీష్‌ తదితరులు నటించారు. సినిమాటోగ్రఫీ: సుజ్ఞాన్, మ్యూజిక్‌ డైరెక్టర్‌: డా. కిరణ్‌ తోటంబైల్‌, రచన, నిర్మాణం, దర్శకత్వం: ఆర్‌. చంద్రు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X