KGF Chapter 2 Trailer: యష్ యాక్షన్ బొనాంజా.. రికార్డులు బద్దలవ్వడం పక్కా.. ట్రైలర్ అదిరింది

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన KGF చాప్టర్ 2 ఫైనల్ గా హడావిడి మొదలు పెట్టేసింది. గత ఏడాది నుంచి మాస్ ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి నేడు సినిమాకి సంబంధించిన మొదటి ట్రైలర్ ను విడుదల చేశారు. హీరో యష్ హై వోల్టేజ్ లుక్ తో షాక్ ఇస్తున్నాడు. చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద బాహుబలి రేంజ్ లో వీరవిహారం చేయడం కాయంగా కనిపిస్తోంది. ఇక ట్రైలర్ ఏ విధంగా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

Recommended Video

KGF Chapter 2 : Kannada And Telugu Ruling Indian Box Office | RRR Movie | Filmibeat Telugu
మొదటి చాప్టర్ సంచలనం

మొదటి చాప్టర్ సంచలనం

2018లో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సినిమా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మేకింగ్ అలాగే యష్ నటన సినిమా రేంజ్ ను మార్చేశాయి. నెగిటివ్ రివ్యూలు వచ్చినా కూడా ప్రేక్షకుల ఆదరణతో సినిమా భారీ సంచలనం సృష్టించింది.

రామ్ చరణ్ తో ట్రైలర్ రిలీజ్

రామ్ చరణ్ తో ట్రైలర్ రిలీజ్

ఇక KGF చాప్టర్ 1 సక్సెస్ కావడంతో ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా చాప్టర్ 2పైనే పడింది. తప్పకుండా ఈసారి సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోందని అందరూ నమ్ముతున్నారు. ఇక సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.

 మిగతా భాషల్లో..

మిగతా భాషల్లో..


ఇక తెలుగులో రామ్ చరణ్ విడుదల చేయగా తమిళంలో సూర్య విడుదల చేయడం జరిగింది. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ , హిందీలో ఫర్హాన్ అక్తర్ వారి భాషల్లో ట్రైలర్స్ ను విడుదల చేస్తున్నారు. తప్పకుండా సినిమా మరో లెవెల్ లో ఉంటుందని ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది. చాప్టర్ 2 అంతకుమించి ఉంటుందని క్లారిటి అయితే వచ్చేసింది.

ట్రైలర్ అదిరింది..


ఇక సినిమాలో యాక్షన్ డోస్ మామూలుగా లేదు. ఇక సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మాములుగా లేదు. ఇప్పటికే ఒక సాంగ్ అన్ని భాషల్లో క్లిక్కయ్యింది. ఫ్యాన్స్ కూడా సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో కామెంట్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక సినిమా ట్రైలర్ విడుదల అవ్వగానే యూట్యూబ్ లో వైరల్ గా మారిపోయింది.

గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

ఇక సినిమాను ఏప్రిల్ 14వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అదే రోజు విజయ్ బీస్ట్ సినిమా కూడా విడుదల కావాల్సింది. కానీ KGF 2తో పోటీ ఎందుకని ఆ సినిమా ను వాయిదా వేయక తప్పలేదు. బీస్ట్ సినిమా ఏప్రిల్ 13వ తేదీన విడుదల కానుంది. ఇక KGF 2 అయితే బాక్సాఫీస్ వద్ద ఎవరు ఉహించని విధంగా భారీ స్థాయిలో రికార్డులు తిరగరాసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్


ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ 400కోట్ల వరకు వెళ్లినట్లు సమాచారం. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమా అనంతరం ప్రభాస్ తో సలార్ సినిమాను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను కూడా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X