మహేష్‌బాబుతో కన్నడ సూపర్‌స్టార్.. పరుశురాం స్కెచ్ వర్కవుట్

సరిలేరు నీకెవ్వరు తర్వాత గీతా గోవిందం దర్శకుడు పరుశురాంతో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు జతకట్టేందుకు సిద్దమవుతున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే విషయం వాయిదా పడింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌‌లో కుటుంబంతో గడుపతుున్న ప్రిన్స్ మహేష్ తన తాజా సినిమాపై దర్శకుడు, నిర్మాతతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

తెలుగులో హీరోగా కన్నడ స్టార్ ఉపేంద్ర పలు బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఆలరించారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఆయన నటన కూడా హైలెట్ అయింది. ఈ క్రమంలో మరోసారి మహేష్‌తో కలిసి నటించేందుకు ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.

Kannada Super star Upendra to play key role in Mahesh Babu and Parasuram

ఇప్పటికే ఉపేంద్రతో చిత్ర యూనిట్ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కథను, రోల్ గురించి వివరించగా.. ఆయన పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాలో భాగం కావడానికి ఉత్సాహం చూపించారు. మాట రూపంలో ఈ సినిమాలో నటించేందుకు ఒకే చెప్పారు. అధికారికంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు జరుగాల్సిందే మిగిలింది అని పలువురు చెప్పారు.

మహేష్‌బాబు కెరీర్‌లో 27వ చిత్రంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి పరుశురాం దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను మే 31న సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం రోజున వెల్లడించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X