Kannappa మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టులో కన్నడ సూపర్ స్టార్.. పాన్ ఇండియా మూవీలో స్టార్ హీరోలు ఎవరున్నారంటే?

యువ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సెన్సేషన్‌కు అడ్డగా నిలుస్తున్నది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సంచలనాలకు వేదికగా నిలుస్తున్నది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టాప్ యాక్టర్లందరూ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కూడా చేరడం మరింత సెన్సేషన్‌గా మారింది. అయితే ఈ సినిమాలో భాగమైన కన్నడ సూపర్ స్టార్, ఇతర స్టార్ హీరోల గురించిన వివరాల్లోకి వెళితే..

కన్నప్ప చిత్రాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు అనుష్క శెట్టి కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా నటించడంతో ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారింది.

Manchu Vishnus Kannappa movie Launch

ఇలాంటి సెన్సేషనల్‌ విషయాలతో విదేశాల్లో కన్నప్ప సినిమా షూటింగ్‌ను మంచు విష్ణు ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సంచలన ప్రకటనను చేశారు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దాంతో ఈ సినిమా సూపర్ పవర్‌గా మారబోతుందనే విషయం స్పష్టమైంది.

కన్నప్ప సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇతను గతంలో మహాభారత్ సిరీస్‌కు పనిచేశారు. ఈ సినిమా భక్త కన్నప్ప వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కుతున్నది.

Shiva Rajkumar to part of theKannappa movie

ఈ సినిమాను ఎవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. శివుడి పరమభక్తుడి జీవితాన్ని తెరకెక్కించేందుకు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ తదితరులు రచయితలుగా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X