డార్లింగ్ ఫ్యాన్స్‌కి బిగ్ అలర్ట్ .. కన్నప్పలో ప్రభాస్ లుక్ రిలీజ్ డేట్ లాక్, ఎప్పుడంటే?
ప్రస్తుతం మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. పోలీస్ కేసులు, కోర్టు ఆదేశాలు, బల ప్రదర్శనలు దాటి విషయం ఎక్కడికో వెళ్తోంది. క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు కుటుంబంలో ఇలా జరగడం ఇండస్ట్రీకి విస్మయానికి గురిచేస్తోంది. పరిస్ధితులు చేయి దాటకుండా మోహన్ బాబుతో పాటు పరిశ్రమలోని కొందరు పెద్దలు రంగంలోకి దిగినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.
మోహన్ బాబు కుటుంబంలో గొడవల నేపథ్యంలో ఈ ఫ్యామిలీ నిర్మిస్తోన్న కన్నప్ప మూవీ వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాపై గొడవలు ప్రభావం పడి కన్నప్ప షూటింగ్ ఆలస్యంగా జరుగుతోందని.. షూటింగ్ కూడా పోస్ట్‌పోన్ అయినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇంత జరుగుతున్నా మంచు విష్ణు మాత్రం సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నారట. కుటుంబంలో పరిస్ధితులు చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తూనే షూటింగ్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటున్నారని ఫిలింనగర్ టాక్.

మహాభారత్ సిరీస్ తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో కన్నప్పను మంచు ఫ్యామిలీ నిర్మిస్తోంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నార్త్ నుంచి సౌత్ వరకు దేశంలోని అన్ని పరిశ్రమలకు చెందిన నటీనటులను ఇందులో భాగం చేస్తూ ప్లాన్డ్‌గా వెళ్తున్నాడు విష్ణు. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సినిమాపై హైప్ తగ్గకుండా టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఊపు తెస్తున్నాడు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నట్లు అధికారికంగా తెలిసినప్పటి నుంచి ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. తొలుత శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తారని అనుకున్నా అక్షయ్ కుమార్ ఈ పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

దీంతో ప్రభాస్ పాత్ర ఏంటీ ? అంటూ డార్లింగ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ప్రభాస్ క్యారెక్టర్‌పై మేకర్స్ అప్‌డేట్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 3న ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తూ త్రిశూలం వెనుక నుంచి ప్రభాస్ కళ్లు కనిపిస్తున్న పోస్టర్ వదిలారు. ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. న్యూజిలాండ్‌లోనే ఈ సినిమాను ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా దాదాపు ఆరు భాషల్లో కన్నప్పను తెరకెక్కిస్తుండగా.. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











