ప్రభాస్ కి షాక్ ఇచ్చిన కన్నప్ప డైరెక్టర్.. డార్లింగ్ లైఫ్ లో మర్చిపోలేడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన అభిమానులను 'కన్నప్ప' చిత్రంతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మైథలాజికల్ ఫిల్మ్ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సహా ఇంగ్లీష్ నూ విడుదలైంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ కన్నప్ప చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం. కాగా ఈ భారీ చిత్రానికి బాలీవుడ్ సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అయితే ఆయన డార్లింగ్ ప్రభాస్ కు కన్నప్ప చిత్రంతో ఊహించని షాక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
కన్నప్ప దర్శకుడికి గిఫ్ట్..
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్పకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. గతంలో ఈయన హిందీ మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేశారు. టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇక ప్రస్తుతం 'కన్నప్ప' చిత్రంతో మరో చారిత్రాత్మక సినిమాను తెరకెక్కించే అవకాశం లభించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో భక్తకన్నప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు ఇండియాలోని టాప్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం ముఖేష్ కుమార్ సింగ్ కు దక్కడం విశేషం. కేవలం మంచు విష్ణు సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది.

ప్రభాస్ కోసం వెయిటింగ్ లో టాప్ డైరెక్టర్లు, టాప్ ప్రొడ్యూసర్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం టాలీవుడ్ లోనే కాకుండా సౌత్, నార్త్ లోని టాప్ డైరెక్టర్లు అంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ప్రభాస్ డేట్స్ ఇస్తారా? తమ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తామా? అని పడిగాపులు గాస్తున్నారు.
ఇప్పటికే ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగ, మారుతీ వంటి దర్శకులు కొన్నాళ్లు వెయిట్ చేసి ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్స్ లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్ట్స్ కూడా స్క్రిప్ట్స్ తో ప్రభాస్ ను డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరోవైపు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు డార్లింగ్ తో సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి.
కన్నప్ప డైరెక్టర్ కు దక్కిన అదృష్టం..
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయో డార్లింగ్ కే తెలియని పరిస్థితి. 2029 వరకు ప్రభాస్ ఇప్పటికే సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారంట. ఆ తర్వాత కూడా ప్రాజెక్ట్స్ ను సెట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రభాస్ తో ఒక్క సినిమా చేసిన చాలానే దర్శకులు కూడా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని సైలెంట్ గా దక్కించుకున్నారు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్. ప్రభాస్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్న డైరెక్టర్లకు రాని అవకాశాన్ని ఎలాంటి శ్రమ లేకుండా ముఖేష్ కుమార్ కు దక్కడం విశేషం.


Click it and Unblock the Notifications











