కన్నప్ప చిత్రం పైరసీ.. ఏకంగా వేలల్లో కాపీలు.. మంచు విష్ణు రియాక్షన్ ఇదే!
మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం కన్నప్ప. మైథాలజికల్ అండ్ యాక్షన్ ఫిలిం గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ దక్కడం విశేషం. దీంతో చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు కూడా అందుతున్నాయి. ఈ క్రమంలో కన్నప్ప చిత్ర యూనిట్ కు భారీ దెబ్బ తగిలింది. కన్నప్ప చిత్రం పైరసీకి గురవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలను మంచి విష్ణు తెలియజేశారు.
కన్నప్ప చిత్రానికి భారీ రెస్పాన్స్..
వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ గా 6 భాషల్లో విడుదలైన కన్నప్ప చిత్రానికి భారీ స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి తెలుగు స్టేట్స్లో ఊహించని రెస్పాన్స్ సొంతం అయ్యింది. దీంతో తెలుగు స్టేట్స్ లో బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు కూడా అదిరిపోతున్నాయి. మరోవైపు ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి రెస్పాన్స్ దక్కుతుండడం విశేషం. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 50 కోట్ల రూపాయల వరకు వసూలు సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

కన్నప్ప చిత్రం పైరసీ..
మంచు విష్ణు కెరియర్ లోనే కన్నప్ప చిత్రం భారీ సక్సెస్ను అందించింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్న ఈ చిత్రం ఇక బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ స్థాయిలోనే బాక్సాఫీస్ వసూలు కూడా అందుతున్నాయి. ఈ క్రమంలో చిత్రానికి భారీ దెబ్బ పడింది. కొందరు కన్నప్ప చిత్రాన్ని పైరసీగా మార్చి సోషల్ మీడియా మాధ్యమాల్లో లింకుల రూపంలో వ్యాప్తి చేస్తున్నారని తాజాగా మంచు విష్ణు తెలిపారు.
మంచు విష్ణు రియాక్షన్..
కన్నప్ప చిత్రం పైరసీగా మారడంతో మంచు విష్ణు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కన్నప్ప పైరసీ విషయాన్ని తానే వెల్లడించారు. కన్నప్ప విజయాన్ని కొందరు పైరసీ ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే 30 వేలకు పైగా ఇల్లీగల్ లింక్స్ ద్వారా సినిమాను కాపీ చేశారు. ఆ 30 వేల లింకులను ఇప్పటికే తొలగించాం. చాలా బాధాకరం. పైరసీ అనేది దొంగతనంతో సమానం. మన భవిష్యత్ తరాలకు దొంగలించడాన్ని మనం నేర్పించకూడదు. పైరసీని ప్రోత్సహించకూడదని విజ్ఞప్తి చేశారు. సరైన మార్గంలో సినిమాలు చూసి ఆదరించాలని కోరారు.
కన్నప్ప చిత్రం 3వ రోజు వసూళ్లు..
కన్నప్ప చిత్రానికి 3వ రోజు రూ.7.25 కోట్ల ఇండియా నెట్ అందింది. దీంతో 3 రోజుల్లో రూ.23.75 కోట్ల వరకు ఇండియా నెట్ చేరుకుంది. ఇక ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 50 కోట్ల
వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఓవర్సీస్ లో రూ.3.6 వసూళ్లు చేసింది. ఇక తెలుగు స్టేట్స్ లో ప్రస్తుతం భారీగానే కలెక్షన్లు అందుతున్నాయి.


Click it and Unblock the Notifications











