Kannappa : కన్నప్ప రిలీజ్ వాయిదా .. మంచు విష్ణు సంచలనం

మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం కన్నప్ప. శ్రీకాళహస్తిశ్వరుడిని భక్తితో ఆర్చించిన కన్నప్ప జీవితకథ ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా ప్రకటన నుంచే ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచింది. బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మోహన్ బాబు. తన కెరీర్‌కు కన్నప్ప బూస్టింగ్ ఇస్తుందని విష్ణు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది ఈ సినిమా రిలీజ్ విషయంలో మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

గత కొంతకాలంగా సరైన హిట్ లేకుండా ఉన్న మంచు విష్ణు తన కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో క్లాసిక్స్‌లో ఒకటైన భక్త కన్నప్పను రీమేక్ చేయాలని విష్ణు నిర్ణయించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా తెరకెక్కిన ఈ క్లాసిక్ మూవీని టచ్ చేయడానికి ఎంతోమంది భయపడ్డారు. ఇన్నేళ్లలో ఎవరూ కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. కానీ మంచు ఫ్యామిలీ ఆ సాహసం చేసింది. ఈ సినిమానే తన జీవితం అన్నంతగా కన్నప్పకు శ్రీకారం చుట్టి కష్టపడుతున్నాడు మంచు విష్ణు.

Kannappa Movie release postponed Manchu Vishnu s post goes viral

2023 ఆగస్ట్ 18న ఈ సినిమా మొదలవ్వగా నేటికీ విడుదల కాలేదు.. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషితో పాటు మోహన్‌లాల్ , ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ క్యాస్టింగ్‌ ఇందులో పాలు పంచుకుంటోంది. ఇప్పటికీ నటీనటుల పాత్రల తాలుకూ పోస్టర్లు విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌‌లపై మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవాస్సే స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి స్వయంగా మంచు విష్ణు కథ , స్క్రీన్ ప్లేను అందిస్తుండటం విశేషం.

ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్స్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న కన్నప్పను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఇంతలో కన్నప్ప సినిమా వాయిదా పడింది. ఈ మేరకు మోహన్ బాబు తనయుడు , హీరో మంచు విష్ణు అధికారికంగా ప్రకటించడంతో చిత్ర సీమ షాకైంది.

కీలకమైన సన్నివేశాల తాలుకూ వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాలేదని, తాము అనుకున్న విధంగా సినిమా రావడానికి మరింత సమయం పడుతుందని మంచు విష్ణు పేర్కొన్నారు. సినిమా ఆలస్యమైనందుకు క్షమించాలని మంచు విష్ణు తెలిపారు. చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతోందని , కొత్త విడుదల తేదీతో మీ ముందుకు వస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కన్నప్ప వాయిదా పడటంతో ఆ రోజున కొన్ని సినిమాలు విడుదల పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Read more about: kannappa manchu vishnu mohan babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X