‘ప్రభాస్ డేట్స్ ఇచ్చినా.. కన్నప్పను వాళ్లే చంపేశారు’
మంచు ఫ్యామిల ఎన్నో అంచనాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం కన్నప్ప. అలనాటి భక్త కన్నప్పకు రీమేక్‌గా పూర్తి ఆధునిక హంగులతో, సరికొత్త కథాంశంతో తెరకెక్కింది కన్నప్ప. ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ లాంటి భారీ స్టార్ క్యాస్టింగ్‌తో నింపేసినప్పటికీ కన్నప్ప బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేయలేదని విమర్శలు వెల్లువెత్తాయి. భారీ నష్టాలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన పరుగును ముగించింది. తాజాగా కన్నప్ప రిజల్ట్‌పై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
భారీ తారాగణంతో కన్నప్ప
కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించ. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషి, మోహన్‌లాల్ , ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటర్‌గా పనిచేశారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్ మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

కన్నప్ప మూవీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కన్నప్ప సినిమాకు దాదాపు రూ.120 కోట్ల నిర్మాణ వ్యయం అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో కన్నప్ప చిత్రాన్ని విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 650, ఇండియాలో 4000, ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్‌లలో కన్నప్పను గ్రాండ్‌గా విడుదల చేశారు. కన్నప్ప చిత్రం క్లీన్ హిట్ కావాలంటే రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కన్నప్ప కలెక్షన్స్
కన్నప్ప తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్ల రూపాయల నెట్, తమిళంలో 78 లక్షలు, హిందీలో 4 కోట్ల రూపాయలు, కన్నడంలో 3 లక్షలు, మలయాళంలో 75 లక్షలు వసూలు చేసింది. ఇండియా వైడ్‌గా 33 కోట్ల రూపాయల నెట్.. 37 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది కన్నప్ప . ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలతో కలిపి వరల్డ్ వైడ్‌గా కన్నప్ప 50 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. థియేట్రికల్ బిజినెస్‌ను బట్టి చూస్తే కన్నప్పకు దాదాపు 130 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. శాటిలైట్, డిజిటల్, ఆడియో హక్కులతో నిర్మాత స్వల్ప నష్టాలతో ఒడ్డున పడినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మాత్రం భారీగా నష్టాలు తప్పవని చెబుతున్నారు.
కన్నప్పను వారియర్‌ని చేశారు
ఇదిలాఉండగా కన్నప్ప రిజల్ట్‌పై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'కన్నప్ప చిత్రం 10 రోజుల్లోనే చాపచుట్టేసింది. ముందు నేను సినిమా చూడలేదు. కలెక్షన్స్ ఇక రావడం లేదన్న టైంలో సినిమా చూశా. నేను చూసినప్పుడు సినిమాలో జనం కూడా లేరు. అయినా చూశా. తర్వాత రెండు, మూడ్రోజులకే సినిమాను తీసేశారు. విష్ణుకి, మోహన్‌బాబుకు ఫోన్ చేసి ఎందుకు ఈ తప్పు చేశారని అడిగా.. ఎవ్వరూ లేకపోయినా సూపర్‌హిట్ అవ్వాల్సిన సినిమాని మీరు బిలో యావరేజ్ సినిమాను చేశారు. ప్రభాస్ లాంటి వ్యక్తి డేట్స్ ఇచ్చి సినిమా చేస్తున్నప్పుడు.. దానిని నిలబెట్టుకుని ఉంటే ఎంతో సెన్షేషన్ అయ్యేది. కన్నప్ప కథను ఏ స్టోరీలో తీసినా హిట్ అయ్యింది.. ఇక్కడ మాత్రం యావరేజ్ అయ్యింది. మోహన్‌బాబు పట్టించుకోలేదు.. పట్టించుకుని ఉంటే సినిమా ఇలా ఉండేది కాదు. భక్త కన్నప్పని వారియర్‌ని చేశారు' అని తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











