Kannappa Trailer Review: కన్నప్ప ట్రైలర్ రివ్యూ.. ఇది తిన్నడి ఆన అంటూ మంచు విష్ణు విశ్వరూపం

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్పపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా సరైన హిట్ లేక రేసులో వెనుకబడ్డారు మంచు విష్ణు.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీనిలో భాగంగా మంచు ఫ్యామిలీ సర్వశక్తులు ఒడ్డి ఈ సినిమాకు ప్లాన్ చేసి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని నిర్మించింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కన్నప్ప ట్రైలర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ జూన్ 14న విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే ..

విమాన ప్రమాదంతో ట్రైలర్ రిలీజ్ వాయిదా
భారతీయ చిత్ర పరిశ్రమలోని అగ్రనటులు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నప్పను తొలుత ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ అనూహ్యంగా కన్నప్ప సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. కీలకమైన సన్నివేశాలు, వీఎఫ్ఎక్స్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విష్ణు తెలిపారు. ఆ తర్వాత కొద్దిరోజులకు జూన్ 27న కన్నప్పను విడుదల చేస్తున్నట్లు విష్ణు మరో డేట్ అనౌన్స్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సినిమా రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ నెల 13నే ట్రైలర్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే అహ్మదాబాద్‌లో ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంతో దేశం విషాదంలో ఉండటంతో ఈ ఈవెంట్‌ను మంచు విష్ణు వాయిదా వేశారు.

Kannappa Trailer Review in Telugu Manchu Vishnu Face Off With Prabhas In Mukhesh Kumar Singh style

వాయులింగం చుట్టూ కన్నప్ప స్టోరీ
ఇక కన్నప్ప ట్రైలర్ విషయానికి వస్తే.. పచ్చని అటవీ ప్రాంతం, అక్కడ ఓ వాయులింగం కోసం కొన్ని తెగల మధ్య ఆధిపత్య పోరు, ఆటవికుడిగా ఉన్న హీరో.. పరమ శివభక్తుడిగా ఎలా మారాడు? వాయులింగం కోసం ఎలా పోరాడాడు? అన్న ఇతివృత్తంగా కన్నప్పను తెరకెక్కించినట్లుగా ట్రైలర్‌లో హింట్ ఇచ్చారు. 2.54 నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్‌.. దేవుడు లేడు.. ఓ చిన్నారి రాయి తీసుకుని అమ్మవారి విగ్రహంపై విసిరికొట్టే సీన్‌తో ప్రారంభమవుతుంది. అడవిని, తిన్నడిని నాశనం చేసి ఆ వాయులింగాన్ని తెచ్చుకుంటానని విలన్ ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తిన్నడు సామాన్యుడు కాదని, అతనిని దాటి వాయులింగాన్ని చేరడం అసాధ్యమని విలన్ మనుషులు చెబుతారు.

శివపార్వతులుగా అక్షయ్, కాజల్
వాయులింగాన్ని కాపాడటానికి మహదేవశాస్త్రి(మోహన్ బాబు) నా ప్రాణాలు సైతం ఆర్పిస్తానని అంటాడు. ఈ గూడెంలో ఏ బిడ్డకు ఆపద రానివ్వనని, ఇది నా ఆన తిన్నడి ఆన అని మంచు విష్ణు శపథం చేస్తాడు. అంతలోనే శివుడిని రాయి అంటావా? అంటూ హీరోపై హీరోయిన్ కోప్పడే సీన్‌ను బట్టి ఆమె శివుడి భక్తురాలని హింట్ ఇచ్చారు. పెద్దల మాటకు విలువ ఇవ్వని హీరోను గూడెం నుంచి గెంటేస్తారు. ఇలాంటి వాడు గొప్ప భక్తుడవుతాడని శివ పార్వతులు తిన్నడి గురించి మాట్లాడుకుంటారు.

గూస్‌బంప్స్ వచ్చేలా ప్రభాస్ లుక్
ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. రుద్ర అనే కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన లుక్ బయటికి వచ్చినప్పుడే భారీ హైప్ నెలకొనగా.. ట్రైలర్‌లో ప్రభాస్ పాత్ర గురించి రివీల్ చేశారు. ఎవరు నువ్వు అని తిన్నడు అడగ్గా.. ఆ పెద్దోళ్లందరి కన్నా నేనే పెద్దోడిని అని ప్రభాస్ చెప్పే చెప్పే డైలాగ్, వారిద్దరి మధ్య ఫైట్ సీన్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. శివయ్యా అని మనసారా పిలవమని రుద్ర అడగ్గా.. అది ఈ జన్మలో జరగదని చెబుతాడు తిన్నడు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ క్యారెక్టర్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంది. చివరిలో శివలింగాన్ని హత్తుకుని నేనింక నిన్ను వదలను ఇది నా ఆన.. తిన్నడి ఆన అంటూ విష్ణు చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, స్టీఫెన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. మొత్తానికి ఈ ట్రైలర్ .. కన్నప్ప సినిమాపై అంచనాలను పెంచేసింది.

Take a Poll

జూన్ 27న కన్నప్ప విడుదల
ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్‌లాల్ , ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌‌లపై కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవాస్సే మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. మంచు విష్ణు స్వయంగా కథ, స్క్రీన్ ప్లేను అందిస్తుండటం విశేషం. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప విడుదల కానుంది.

More from Filmibeat

Read more about: kannappa manchu vishunu prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X