Kantara A Legend: అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా కాంతారా చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్.. ఓ లుక్కేయండి!
కాంతారా.. గతేడాది విడుదల అయిన ఈ సినిమా ఎవరూ ఊహించని స్థాయిలో హిట్టు కొట్టింది. సినిమా తీసేటప్పుడు కానీ, విడుదల అయ్యేటప్పుడు కానీ ఎవరికీ ఈ చిత్రంపై అంత పెద్ద అంచనాలు లేవు. కానీ సినిమా విడుదల మంచి టాక్ వచ్చాకా విపరీతమైన హైప్ వచ్చింది. ఎవరూ ఊహించని స్థాయిలో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ముఖ్యంగా 15 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం 400 కోట్లకు పైగా వసూలు చేసి అందరికీ షాకిచ్చింది.
ముఖ్యంగా కన్నడ భాషలో మాత్రమే వచ్చిన ఈ చిత్రాన్ని అన్ని భాషల ప్రొడ్యూసర్లు విపరీతమైన ధరలకు కొనుగోలు చేయడంతో మరిన్ని లాభాలు అందుకున్నారు చిత్రబృందం. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. అయితే తెలుగులో ఈ సినిమా హక్కులను దక్కించుకున్న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. రిషబ్ శెట్టి, కిషోర్‌కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమిగౌడ, ప్రమోద్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదల కాగా.. తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది.

ఎవరూ ఊహించని స్థాయిలో ఈ సినిమా హిట్టుగా నిలవడంతో రిషబ్ శెట్టి దీనికి సీక్వెల్ మూవీ తేవాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించగా.. దేశ వ్యాప్త ప్రజలు ఈ చిత్రం పార్ట్ 2 కోసం వేచి చూస్తున్నారు. అయితే ఈరోజు చిత్రబృందం కాంతార చాప్టర్ 1కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో రిషబ్ శెట్టి లుక్ చూస్తే అభిమానుల రోమాలు నిక్కబొడవడం ఖాయం. అద్భుతమైన లుక్ లో అందరినీ ఆశ్చర్యపరిచేలా రిషబ్ శెట్టి ఉన్నారు. ముఖ్యంగా ఒళ్లంతా రక్తంతో భయంకరంగా కనిపించారు.
ముందుగా ఈ ఫస్ట్ లుక్ టీజర్ లో రిషబ్ శెట్టి అడవిలో పరిగెత్తడం మనం చూడవచ్చు. ఆ తర్వాత అతడిని ఓ అగ్ని వలయం చుట్టుముట్టడం.. ఆ తర్వాత వెలుగు.. వెలుగులో కంటికి అంతా కనిపిస్తుంది... కానీ అది వెలుగు కాదు నాశనం.. గతంలో జరిగింది, తర్వాత జరగబోయేది అంతా చూపిస్తున్నా వినుకో... కనబడుతుందా అంటూ వచ్చిన డైలాగ్స్, అదే సమయంలో ప్లే అవుతున్న మ్యూజిక్ అయితే విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇఖ ఆ తర్వాత మెడలో రుద్రాక్ష మాలలు, చేతిలో త్రిశూలం, ఒళ్లంతా రక్తం.. కళ్లల్లో నిప్పుల గుండం కనిపిస్తుంగా.. రిషబ్ శెట్టిని చూస్తే ఒళ్లు జలదరిస్తోంది.
కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, బంగ్లా భాషల్లో ఈ ఫస్ట్ లుక్ టీజర్ అందుబాటులో ఉంది. అయితే ఈ చిత్రాన్ని వచ్చేడా ఏడాది విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ నెల చివరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ చిత్రంలో ఇంకా ఎవరెవరు నటిస్తారు, సాంకేతిక నిపుణుల వంటి వారి వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.


Click it and Unblock the Notifications











