twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kantara for Oscar 2022 ఆస్కార్‌కు వెళ్తుందా? అదిరిపోయేలా రిషబ్ శెట్టి రియాక్షన్

    |

    ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కంతార చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భారతీయ భాషల్లో సంచలన విజయం సాధిస్తున్నది. ఇంటర్నేషన్‌ స్థాయిలో రికార్డుల వర్షం కురిపిస్తున్నది. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖులు, విమర్శకులు ఈ సినిమా కథపై, రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద 39 రోజులుగా భారీ వసూళ్లను సాధిస్తున్న ఈ చిత్రం ఇక ఆస్కార్ సాధించాలనే దిశగా ప్రయాణం కొనసాగిస్తున్నది. ఈ సినిమాను ప్రేక్షకులు ఆస్కార్‌ అవార్డులకు నామినేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆస్కార్‌కు పంపించే ఉద్దేశం ఉందా అని రిషబ్ శెట్టిని అడిగితే...

    Kantara

    కంతార సినిమా చేసేటప్పుడు మేము ఇంతటి విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఇలాంటి రెస్పాన్స్ దేశవ్యాప్తంగా వస్తుందని అనుకోలేదు. ఇప్పుడిప్పుడే ఆ ఎమోషన్స్‌ నుంచి బయటపడుతున్నాం. ఇప్పటికిప్పుడు ఆస్కార్ గురించి ఆలోచించడం లేదు అని రిషబ్ శెట్టి ఇటీవల మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.

    ఇక కంతార సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. కర్ణాటకలో 140 కోట్లకుపైగా, ఏపీ, తెలంగాణలో 40.5 కోట్లు, తమిళనాడులో 5.75 కోట్లు, కేరళలో 8.25 కోట్లు, ఉత్తర భారతదేశంలో 51 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం 300 కోట్లకు చేరువైంది.

    ఇదిలా ఉంటే.. కంతారా చిత్రం బాహుబలి 2 రికార్డును తిరగరాసింది. బాహుబలి 2 చిత్రం 5వ వారంలో 23.20 కోట్లు సాధిస్తే.. 5 వారం ముగిసే సరికి కంతారా 40.30 కోట్లు వసూలు చేసింది.

    English summary
    Kantara for Oscar 2022: Here is the Rishab Shetty's reactions
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X