Kantara: 'వరాహ రూపం' పాటపై కేసు.. నిర్మాతలకు మరో షాక్ ఇచ్చిన న్యాయస్థానం

కన్నడ భాషలో రూపొందిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమాను హోంబెల్ ఫిలిమ్స్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ లో ఎంతో ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా వరాహా రూపం అనే పాట కూడా అన్ని ఇండస్ట్రీలలో మంచి క్రేజ్ అందుకుంది. అంజిష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెలిసిందే. అయితే కాంతార సినిమా సక్సెస్ లో ఎంతో కీలకంగా నిలిచిన ఆ పాట ట్యూన్ ను కాపీ కొట్టారు అని కేసు నమోదైంది. దీంతో ఆ పాటను డిజిటల్ మీడియా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ప్రదర్శించకూడదని కేరళలోని కోజ్‌కోడ్‌ జిల్లా సేషన్స్‌ కోర్టు ఆదేశించింది. తాయిక్కుడమ్ బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్‌ ఈ సాంగ్ తమ నుంచి కాపీ కొట్టారని ఆరోపణలు చేసింది.

Kantara movie varaha roopam song copy rights issue and Kerala High Court dismisses plea by producer

అయితే ఇప్పుడు ఓటీటీ లో కూడా ఆ సాంగ్ కట్ చేశారు. ఇక ముందుగానే నిర్మాణ సంస్థ హోంబెల్ ఫిలిమ్స్ కేరళ హై కోర్ట్ లో కౌంటర్ అప్పీల్ దాఖలు చేసింది. అయితే సబార్డినేట్ కోర్టు జారీ చేసే ప్రతి మధ్యంతర ఉత్తర్వుతో పర్యవేక్షక అధికార పరిధి జోక్యం చేసుకోదని కోర్టు స్పష్టం చేసింది. ఫైనల్ గా "వరాహ రూపం" పాటను ఉపయోగించడంపై చిత్ర నిర్మాత చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది.

ఇక ఇప్పుడు తాయిక్కుడమ్ బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్‌ వారికి కేసు అనుకూలంగా ఉండడం వలన మరో కొత్త సమస్య ఎదురైంది. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తంలో చెల్లింది ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లలో కాంతార గత రాత్రి నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక వరాహ రూపం పాట ప్రదర్శనకు మళ్ళీ చట్టపరమైన అడ్డాకులు ఏర్పడ్డాయి. మరి ఈ కాపీ రైట్స్ కేసులో హోంబెల్ ఫిలిమ్స్ వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X