Upcoming Movies: పండుగకు కొత్త కళ.. అక్టోబర్ నెలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
Upcoming Movie: సినిమా ఇండస్ట్రీకి పండుగలకు విడదీయలేని ఓ బంధం ఉంది. పండుగలను టార్గెట్ చేస్తూ సినిమాలను విడుదల చేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. పండుగ వేళలో విడుదలయ్యే ఏ సినిమాకైనా మంచి కలెక్షన్లు వస్తాయి. ఇక సరైనా కంటెంట్ ఉన్న సినిమా ఫెస్టివల్ సీజన్ లో విడుదల అయితే.. థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం ఖాయం. ఇక దసరా నుంచి దీపావళి వరకు సందడి చేయబోతున్న సినిమాలు ఏంటీ? అక్టోబర్ లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపే మూవీ ఏంటో ఓ లూక్కేయండి.
ఇప్పటికే ఈ నెల( సెప్టెంబర్) లో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు విజయాలు సాధించాయి. చాలా రోజుల తరువాత దసరాకు ముందు సంక్రాంతి సినిమా వేవ్ కనిపించింది. ఆగస్టు చివర్లో విడుదలైన కొత్త లోక, లిటిల్ హార్ట్స్, మిరాయ్ వంటి సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక పవన్ కళ్యాణ్ 'ఓజీ'భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ యాక్షన్ మూవీ కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఓజీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ.. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మరోవైపు.. ఘాటి, మదరాసి ఆశించిన స్థాయిలో ఆడకపోయినా మంచి ఓపెనింగ్స్ సాధించాయి.

ముఖ్యంగా తేజా సజ్జా మిరాయ్, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్దనే కాదు. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మిలియన్ల కొద్దీ డాలర్లు రాబట్టి, తెలుగు సినిమాకు మరింత గుర్తింపు తెచ్చాయి. ఈ జోష్ ను అలాగే కొనసాగించేలా అక్టోబరులోనూ వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దసరా-దీపావళి పెద్ద పండగలు ఒకే నెలలో రావడంతో, బాక్సాఫీస్ మరింత కళకళలాడనుంది.
దసరా స్పెషల్ రిలీజ్‌లు
ఇడ్లీ కొట్టు : స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించి హీరోగానూ నటించిన ఇడ్లీ కొట్టు సినిమా అక్టోబర్ 1న రిలీజ్ అవుతోంది. నిత్యామీనన్ కథానాయికగా నటించిన ఈ మూవీ మధ్య తరగతి కుటుంబం చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామా.
కాంతార: చాప్టర్ 1: స్టార్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి హీరోగా నటించిన కాంతార: చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ మూవీ కాంతార సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 7,000కుపైగా థియేటర్లలో విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో ఈ సినిమా హైప్ మరింత పెరిగింది.
శశివదనే: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం శశివదనే. అక్టోబరు 10న 'శశివదనే' అనే సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాకు సాయిమోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు.
దీపావళి ధమాకా
దీపావళి వారంలో బాక్సాఫీస్‌పై వరుసగా సినిమాలు దుమ్మురేపబోతున్నాయి. మిత్రమండలి: ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ మిత్రమండలి . ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ అవుతోంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'తెలుసు కదా'. ఈ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా లవ్ స్టోరీగా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అదే రోజు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'డ్యూడ్' సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. ఇది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. ఇక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా దీపావళి రేసులో నిలిచారు. అక్టోబర్ 18న కిరణ్ అబ్బవరం తన 'కె-ర్యాంప్' మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీతో కూడిన మాస్-ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.
బాహుబలి: ది ఎపిక్
అక్టోబర్ చివర్లో బాక్సాఫీస్‌ను మరింత హాట్‌గా సినిమా బాహుబలి: ది ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ రెండు సినిమాలకు కలిపి ఒకే సినిమాగా ఈ కొత్త వెర్షన్ సిద్ధం చేశారు. అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా మరోసారి దేశవ్యాప్తంగా బాహుబలి మానియాను రిపీట్ చేయనుంది.మొత్తానికి సెప్టెంబర్‌లో తెలుగు సినిమాలు రికార్డులు బద్దలుకొడితే, అక్టోబరులోనూ అదే జోరు కొనసాగనుంది.


Click it and Unblock the Notifications











