కాంతార అభిమానులకు గుడ్ న్యూస్.. సినిమాలో మళ్ళీ ఆ సన్నివేశాలు.. కేసులో గెలిచిన నిర్మాతలు..
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 400 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకుని కేజీఎఫ్ 2 తర్వాత అత్యధిక వసూళ్లను సొంతం చేసుకున్న కన్నడ సినిమాగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా ఓటీటీ లో విడుదలైతే మరోసారి చూడాలని చాలామంది ప్రేక్షకులు కోరుకున్నారు.
ఇక అనుకున్నట్లే ఇటీవల సినిమాను ఓటీటీ లో విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ లో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కు లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. అయితే సినిమాలోని అసలైన పాట లేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. వరాహ రూపం అనే పాట సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ పాట మరొక ఎత్తు అని చెప్పవచ్చు. అందులో వచ్చే సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయి.

ముఖ్యంగా రిషబ్ శెట్టి నటన కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే వరాహ రూపం పాట కాపీ కొట్టారు అని మలయాళం బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్' ప్రతినిధులు కేరళ కోర్టులో కేసు వేశారు. తమ అనుమతి. లేకుండా ట్యూన్ ఎలా కాపీ కొడతారు అని ఆరోపణలు చేసి కేరళ కోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ పూర్తయ్యే వరకు కూడా మరికొన్ని రోజులపాటు డిజిటల్ మీడియాలో వరహరూపం పాటను ఎట్టి పరిస్థితిలోనూ ప్రసారం చేయకూడదు అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వరాహం రూపం పాట కోసం చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ న్యాయపోరాటానికి దిగింది. ఇక ఎట్టకేలకు విచారణ జరిపిన తర్వాత కోర్టు నుంచి చిత్ర నిర్మాణ సంస్థకు అనుకూలంగా తీర్పు వచ్చింది. వరాహ రూపం పాట ప్రదర్శన పై మద్యం ఉత్తర్వులను ఎత్తివేసినట్లుగా తెలియజేశారు. ఇక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో వరహరూపం పాటను కూడా చూడవచ్చు.


Click it and Unblock the Notifications











