హీరోయిన్లతో రొమాన్స్ దంచేసిన... 7 మూవీ హీరో!
హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్, రమేష్ వర్మ ప్రొడక్షన్స్ బేనర్లో రమేష్ వర్మ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'సెవెన్'. ఏడుగురు అమ్మాయిలతో హీరో ప్రేమ వ్యవహారం నడిపించే విభిన్నమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు.
సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా సూపర్ హాట్ సాంగ్ విడుదల చేశారు. 'కనులకిది తీయని కలయా' అంటూ సాగే ఈ పాటలో హీరోతో పాటు అందరు హీరోయిన్లు నటించారు. రొమాంటిక్ డోసు పెంచేసి చిత్రీకరించిన ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది.
రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన 'సంపోద్దోయ్ నన్నే', పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన 'ఇదివరకెపుడు తెలియదు' పాటలు విడుదలమంచి స్పందన సొంతం చేసుకున్నాయి.
జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ కాపీ చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా క్రేజీ ఆఫర్ ఇచ్చి సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు.

ఈ చిత్రంలో ఇంకా పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, 'జబర్దస్త్' వేణు, ధనరాజ్, సత్య, 'జోష్' రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్, జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











