బాలీవుడ్‌లోకి కపిల్ దేవ్ కూతురు.. రణ్‌వీర్ సింగ్ చిత్రంలో.. ఏ పాత్ర అంటే
బాలీవుడ్‌లో యువ హీరో రణ్‌వీర్ సింగ్ మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందించే 83 చిత్రంలో భారతీయ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రను పోషించనున్నారు. ఈ పాత్ర కోసం స్వయంగా రణ్‌వీర్‌కు కపిల్ శిక్షణ ఇస్తుండటం గమనార్హం.
1983లో భారత జట్టు తొలి ప్రపంచ కప్‌ను గెలిచిన సంఘటన ఆధారంగా 83 అనే చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రంలో కపిల్ కూతురు అమియా కూడా భాగం కానున్నారు. దర్శకుడు కబీర్ ఖాన్‌కు అమియా దేవ్ సహయ దర్శకురాలిగా వ్యవహరించనున్నారు.

ఇక ఈ చిత్రంలో మరో ప్రముఖ క్రికెటర్ సందీప్ పాటిల్ కుమారుడు చిరాగ్ పాటిల్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరాగ్ తన తండ్రి పాత్రనే పోషించడం విశేషం.
83 చిత్రంలో రణ్‌వీర్ సింగ్, చిరాగ్ పాటిల్‌తోపాటు సాఖీబ్ సలీం, తాహిర్ రాజ్ భాసిన్, జివా, సాహిల్ ఖట్టర్, హార్డీ సంధూ, ఆమ్మీ విర్క్, పంకజ్ త్రిపాఠి, తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను 100 రోజుల పాటు ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్ దేశాల్లో నిర్మిస్తారు. ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











