స్పోర్ట్స్ సినిమాలే వచ్చేవి కాదు.. రణవీర్ సింగ్ '83'పై కపిల్ దేవ్!
భారత దిగ్గజ క్రికెటర్స్ లో కపిల్ దేవ్ ఒకరు. ఇండియాకు తొలి ప్రపంచకప్ అందించిన సారథి అతడు. 1983లో ఇండియా ప్రపంచకప్ గెలవడంతో కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. కపిల్ దేవ్ జీవిత చరిత్రపై 83 పేరుతో చిత్రం కూడా రూపొందుతోంది. ఈ చిత్రంలో కపిల్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 83పై ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి.
ఇటీవల కపిల్ దేవ్ రణవీర్ సింగ్ కు క్రికెట్ మెళుకువలు నేర్పిస్తూ కనిపించాడు. కపిల్ దేవ్ క్రికెట్ అదే సమయంలో ఎలా ప్రవర్తించేవాడో అన్ని విషయాలని రణవీర్ సింగ్ తెలుసుకున్నాడు. కొన్ని నెలలుగా క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. తాజాగా కపిల్ దేవ్ 83 చిత్రంపై స్పందించారు. ఒకప్పుడు ఇండియాలో స్పోర్ట్స్ సినిమాలే వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువసంఖ్యలో క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలు వస్తున్నాయి. ఇది సంతోషించదగ్గ విషయం.

83 చిత్రంలో రణవీర్ సింగ్ నా పాత్రలో నటిస్తున్నాడు. అతడు బాగా చేయగలడా లేదా అనేది తెరపైనే చూడాలి. కానీ ఆ చిత్ర యూనిట్ మొత్తం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండడం గమనించాను. రణవీర్ సింగ్ లో ఎంతో ఎనర్జీ దాగుందని కపిల్ దేవ్ తెలిపారు. నేను క్రికెట్ ఆడడం నా కుమార్తె ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నా కూతురు నా బయోపిక్ చిత్రానికి అసిస్టెంట్ దర్శకురాలిగా ఉండడం సంతోషంగా ఉందని కపిల్ దేవ్ తెలిపారు. 83 చిత్రాన్ని 2020 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











