twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లోకి క్రికెట్ లెజెండ్ కుమార్తె!

    |

    భారత దిగ్గజ క్రికెటర్స్ లో కపిల్ దేవ్ ఒకరు. ఇండియాకు తొలి ప్రపంచకప్ అందించిన సారథి అతడు. 1983లో ఇండియా ప్రపంచకప్ గెలవడంతో కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. కపిల్ దేవ్ జీవిత చరిత్రపై 83 పేరుతో చిత్రం కూడా రూపొందుతోంది. ఈ చిత్రంలో కపిల్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్ర షూటింగ్ మే నుంచి ప్రారంభం కాబోతోంది.

    ఇప్పటికే రణవీర్ సింగ్ ఈ చిత్రం కోసం క్రికెట్ కు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ చిత్రంతోనే కపిల్ దేవ్ కుమార్తె అమియా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కానీ నటిగా కాదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి ఆమెని తీసుకున్నారు. కపిల్ దేవ్ జీవితం గురించి, 1983లో ప్రపంచ కప్ సాధించిన విధానాన్ని దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాడు.

    Kapil Devs daughter gives entry into bollywood as assistant director

    83 ప్రపంచ కప్ లో భాగమైన పలువురు మాజీ క్రికెటర్స్ పాత్రల కోసం దర్శకుడు నటుల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం బయోపిక్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రలపై కూడా బయోపిక్ చిత్రాలు ఇప్పటికే వచ్చాయి. కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ ఎలాంటి నటన కనబరుస్తాడో అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

    English summary
    Kapil Dev's daughter gives entry into bollywood as assistant director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X