సౌత్ దర్శకుడి రంగుపై హిందీ కమెడియన్ సెటైర్లు .. స్పాట్‌లో నోరు మూయించాడుగా
ఎప్పటి నుంచో హిందీ సినిమా బాక్సాఫీస్ డామినేషన్ టోటల్ ఇండియా వైడ్ గాని బయట దేశాల్లో కానీ ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడైతే మన తెలుగు సినిమాలు డామినేషన్ మొదలు పెట్టాయో పాన్ ఇండియా సినిమా రూపు రేఖలు మారిపోయాయి. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో 1000 కోట్ల బాక్సాఫీస్ మార్క్ అనేది చాలా సింపుల్ అయ్యిపోయింది. కానీ ఒక దశాబ్దం కిందటే బాలీవుడ్ స్టార్స్ దాదాపు ఆ మార్క్ కి దగ్గరలోకి వెళ్లారు కానీ ఆగిపోయారు.
అయితే డైరెక్ట్ 1000 కోట్ల మార్క్ ని హిందీ సినిమాలో అది కూడా ఓ హిందీ స్టార్ హీరోకి ఇచ్చిన దర్శకుడికి మాత్రం బాలీవుడ్ ప్రముఖుల నుంచి అవమానం జరగడం అనేది బాధాకరం అని చెప్పాలి. ఆ దర్శకుడే తమిళ యువ అండ్ స్టార్ దర్శకుడు అట్లీ. హిందీ సినిమా ఎంతో స్ట్రగుల్ అవుతున్న సమయంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కి అసలైన కం బ్యాక్ ఇచ్చింది ఈ చిత్రం.

దీనికి ముందు వచ్చిన పఠాన్ కంటే బిగ్ హిట్ గా అట్లీ హిందీ సినిమాకి 1000 కోట్ల చిత్రాన్ని అందించాడు. మరి ఇలాంటి సినిమా ఇచ్చిన దర్శకుని రంగుపై హిందీ నటుడు అలాగే హిందీ హిట్ టాక్ షో వ్యాఖ్యాత కపిల్ శర్మ జోకులు వేయడం ఇపుడు చిత్ర సీమలో దుమారం రేపుతోంది. అట్లీ హిందీలో నిర్మాణం వహించిన లేటెస్ట్ సినిమా బేబీ జాన్ ప్రమోషన్స్ నిమిత్తం కపిల్ శర్మ టాక్ షోలో తన హీరో వరుణ్ ధావన్ అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిసి వెళ్ళాడు.
అయితే ఆ షోలో కపిల్ శర్మ అట్లీతో మాట్లాడుతూ మీరు షారుఖ్‌ని తొలిసారి కలిసినప్పుడు ఆయన మిమ్మల్ని వెతుక్కున్నారా? అంటూ తన నలుపు రంగుపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేసాడు. దీనితో దానిని వెంటనే అర్ధం చేసుకున్న అట్లీ మొదట చిన్నగా హర్ట్ అయ్యినట్టుగా కనిపించినప్పటికీ అదిరిపోయే సమాధానం అందించాడు. మీరు అంటున్నది నాకు అర్ధం అయ్యింది.
నాకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చింది దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ గారు. నా మొదటి సినిమా నిర్మాణం వహించింది ఆయనే. నేను కథ చెప్పడానికి వెళ్ళినపుడు ఆయన నా ఆకారమో నా రంగో చూడలేదు, నా కథని నమ్మారు అని చెప్పాడు. అందుకే అవతల వాళ్ళని కేవలం వారి ఆకారం చూసి ఎప్పుడూ ఒక అంచనా వెయ్యకూడడు.
వాళ్ల మనసు ఎలాంటిది అనేది చూసి అంచనా వెయ్యాలి అంటూ కపిల్ శర్మకి అక్కడే గట్టిగా ఇచ్చి పడేసాడు. దీనితో తనని హేళన చేసిన కపిల్ శర్మే ఆన్ ది స్పాట్ చప్పట్లు కొట్టి ప్రశంసించాడు. ఇలా తన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అట్లీ నెటిజన్స్ హృదయాల్ని గెలుచుకున్నాడు.


Click it and Unblock the Notifications











