కమెడియన్ కేఫేపై అగంతకుల కాల్పులు.. తుపాకితో 9 రౌండ్లపాటు
పాపులర్ కమెడియన్, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో హోస్ట్ కపిల్ శర్మ ఇటీవల కెనడాలో ప్రారంభించిన క్యాప్స్ కేపేపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన అగంతకులు కెఫే ఎదుట ఆపి.. తుపాకితో కాల్పులకు పాల్పడ్డారు. ఈ సంఘటన కెనడాలో సంచలనం రేపింది. కానీ ఖలీస్థాన్ తీవ్రవాదులు తామే అంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పోస్టు చేశారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
కామెడీ నైట్స్ ఆఫ్ కపిల్ శర్మ అత్యంత పాపులారిటీ సంపాదించిన కపిల్ శర్మ కెనడాలోని సర్రేలో ఇటీవల క్యాప్స్ కెఫేను ప్రారంభించారు. అయితే బుదవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అగంతకులు పలు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడిని పరారయ్యారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. కాల్పుల ఘటన తెలుసుకొన్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.

కామెడీ నైట్స్ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన కపిల్ శర్మ తొలిసారి బిజినెస్ రంగంలోకి ప్రవేశించారు. తొలి ప్రయత్నంగా కెనడాలో హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటులో కపిల్ భార్య గిన్నీ ఛత్రాత్ అన్నీ తానై చూసుకొన్నారు. కపిల్ శర్మ ఇటీవల అంటే.. మూడు రోజుల క్రితం ఈ కేఫెను కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో ప్రారంభించారు.
ఈ కేఫే ముందు దాదాపు 9 రౌండ్లపాటు కాల్పులు జరిపారు. కాల్పుల గుర్తులు కేఫే గ్లాస్ గోడలపై స్పష్టంగా కనిపించాయి. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ కూడా గాయపడకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకొన్నారు. మూడు రోజుల క్రితమే ప్రారంభమైన ఈ కేఫేపై ఎటాక్ చేయడం సంచలనంగా మారింది. అయితే బీకేఐ తీవ్రవాదులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని తొలుత అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతానికి ఫొరెన్సిక్ నిపుణులు చేరుకొని.. సాక్ష్యాలను, కాల్పులకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. ఆ ప్రాంతాన్ని సీజ్ కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి.
అయితే కొద్దికాలం ఈ సంస్థ గురించి కపిల్ కామెంట్స్ చేయడమే ఈ ఘటనకు కారణమా? అని ఆనుమానిస్తున్నారు. అయితే బలవంతపు వసూళ్ల నేపథ్యంగా ఈ కాల్పులు జరిపారా? లేదా కపిల్ శర్మ వర్గాలను బెదిరించడానికి ఈ చర్యకు పూనుకొన్నారా? అనేది సెన్సేషన్‌గా మారింది. అయితే రెసిడెన్షియల్ ఏరియా, అలాగే పిల్లల స్కూల్స్ ఉన్న ప్రాంతంలో ఉన్న ఈ హోటల్‌పై కాల్పులు జరపడం అందరినీ భయాందోళలనకు గురి చేసింది.
అధికారులు ఊహించినట్టుగానే.. క్యాప్స్ కేఫేపై కాల్పులకు బాధ్యులం మేమే. ఈ చర్యకు పాల్పడింది మా వర్గమే అని ఖలీస్థాన్ టెర్రరిస్ట్ హర్జిత్ సింగ్ లడ్డీ అధికారికంగా ప్రకటించారు. ఇండియాలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సంస్థ మోస్ట్ వాంటెడ్ లిస్టులో లడ్డీ ఒకరు అనే విషయం తెలిసిందే. విశ్వ హిందూ పరిషత్ నేత వికాస్ ప్రభాకర్ అలియాస్ వికాస్ బగ్గా హత్య కేసులో ప్రధాన నిందితుడు. 2024 ఏప్రిల్‌లో పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలో ఆయనను కాల్చిచంపారు.


Click it and Unblock the Notifications











