నెట్ ఫ్లిక్స్ పై రూ.25 కోట్ల దావా.. వివాదంలోకి ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో
ఇండియాస్ మోస్ట్ పాపులర్ స్టాండప్ కమెడియన్, టెలివిజన్ ప్రెజెంటర్, హోస్ట్ కపిల్ శర్మకు తెలుగు ఆడియెన్స్ ల్లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాలను నార్త్ లో ఎక్కువగా ఆయనే ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పేరుపైనే టాక్ షో నిర్వహిస్తుండటం ఆయన గొప్పతనానికి నిదర్శనంగా చెప్పొచ్చు. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో కపిల్ శర్మ 2006 నుంచి యాక్టివ్ గా ఉంటున్నారు. స్టాండప్ కామెడీ రియాలిటీ షోల ద్వారా స్టార్ గా ఎదిగారు.
ఇక ఇటీవల కపిల్ శర్మ పేరు బాగా వార్తాల్లో నిలుస్తోంది. ఆయన లండన్ లో నిర్మించుకున్న ఇంటిపై కొందరు దాడులు జరపడం ఆ మధ్య పెద్ద చర్చగా మారింది. ఆ కొద్ది రోజులకే మరోసారి ఆయన ఇంటిపై అదే తరహాలో దాడి జరిగింది. ఇక తాజాగా ఆయన పేరుపై కొన్నాళ్లుగా హిందీ టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (The Great Indian Kapil Show). నార్త్ ఆడియెన్స్ లో ఈ షోకు ఎంతో ఆదరణ దక్కింది. బాలీవుడ్ టాప్ సెలబ్రెటీలు, ఒకింత ఇండియాలోని టాప్ సెలబ్రెటీలు ఈయన షోకు వస్తుండటం విశేషం.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోను ఒరిజినల్ లాంగ్వేజీ హిందీలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్ట్స్ 2024 మార్చి 30 నుంచి కొనసాగిస్తోంది. తొలుత ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 1ను ప్రదర్శించింది. ఇందులో 13 ఎపిసోడ్స్, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 ద్వారా 13 ఎపిసోడ్స్ ను అందించారు. ఇక ప్రస్తుతం ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 ద్వారా 14 ఎపిసోడ్స్ ను ప్రసారం చేస్తున్నాన్నారు. కాగా సీజన్ 3లో 13 ఎపిసోడ్స్ ముగిశాయి. ఇక 14 ఎపిసోడ్ కు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గెస్ట్ గా రావాల్సి ఉంది. సెప్టెంబర్ 20న స్ట్రీమింగ్ కావాల్సిన ఈ ఎపిసోడ్ కాస్తా న్యాయపరమైన నోటీసుల కారణంగా నిలుపుదల అయ్యింది.
బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఫిరోజ్ నదియావాలా తాజాగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోను ప్రసారం చేస్తున్న ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కు 25 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలంటూ లీగల్ నోటీసులు పంపించారు. ఆయన సొంతం చేసుకున్న హెరా పేరీ ఫ్రాంచైజీలో నటుడు కికు శర్దా నటించిన ఐకానిక్ క్యారెక్టర్ బాబు రావు ఆప్టే. ఈ పాత్రను ఇప్పుడు ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో పరేష్ రావల్ కాపీ కొట్టారని నోటీసులో పేర్కొన్నారు.
బాబు రావు పాత్ర అనేది తమ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ హేరా పేరికి ప్రాణం వంటిదని, అలాంటి ఐకానిక్ పాత్రను కాపీ కొట్టడం సరికాదన్నారు. కనీసం పర్మిషన్ కూడా తీసుకోలేదని చెప్పారు. వెంటనే ఆయన నిడివి తొలగించాలని, అలాగే క్షమాపణలు చెబుతూ రూ.25 కోట్ల పరిహారం కూడా చెల్లించాలని నిర్మాత డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్ 51 కాపీ రైట్ యాక్ట్, ట్రేడ్ మార్క్ ఉల్లంఘన సెక్షన్ 29 ద్వారా ఈ మొత్తాన్ని చెల్లించాని డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











