మొదలయిన మరో సూపర్ హిట్ రీమేక్.. సితార బ్యానర్లో త్రివిక్రమ్ చేతుల మీదుగా!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా మలయాళ సినిమాల మీద తెలుగు దర్శక నిర్మాతలు ఫోకస్ పెడుతున్నారు.. అందులో భాగంగానే ఇప్పటికే చాలా మలయాళ రీమేక్ సినిమాలు సిద్ధంగా ఉండగా ఇప్పుడు మరో మళయాళ రీమేక్ సినిమా షూటింగ్ మొదలైంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన కప్పేల అనే సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ప్రొడక్షన్స్ తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది..

ఈ క్రమంలో ఈ రోజు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా ప్రారంభింపచేసింది. గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాల్లో హీరోగా నటించిన 'సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. 'సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 9' గా ఈ సినిమాని వ్యహరిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ టి.రమేష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దేవతామూర్తుల ముందు క్లాప్ నివ్వడంతో సినిమా ప్రారంభమయింది. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్ రాధాకృష్ణ (చినబాబు)స్క్రిప్టును చిత్ర దర్శకుడికి అందించారు. ఇక ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ దాస్(మాస్టర్ ఫేమ్) కీలక పాత్ర పోషిస్తున్నారు.

 kappela movie Telugu remake shooting started with pooja ceremony

ఆయనకు తెలుగులో ఇదే తొలి చిత్రం. గ్రామీణ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నేడు పూజా కార్యక్రమాలు తో ప్రారంభమైన ఈ చిత్రం ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవనుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు నటిస్తున్నారు అలాగే ఇతర కీలక పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అనే విషయాల మీద త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.. ప్రస్తుతం పవన్ రామా నటిస్తున్న సూపర్ హిట్ మలయాళ సినిమా రీమేక్ హక్కులు ఉన్నప్పుడే ఈ సినిమా రీమేక్ హక్కులను కూడా నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X